కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుబలం గ్రామ సమీపంలో పొలం పనికి పోయి తిరిగి వస్తుండగా కారు ఢీ కొట్టడంతో బొంపల్లి నరసింహులు (48) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద తుంబలం ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు బొంపల్లి నరసింహులు పొలంలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా కర్ణాటక కు చెందిన కారు వేగంగా వెనకనుంచి ఢీకొట్టడంతో రైతు బొంపల్లి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన కారు మైసూరు వాసులుగా గుర్తించామని మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో మైసూర్ కు వెళ్తున్నారని ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించామని తెలిపారు.