ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి

భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ భూతం నుండి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రిటైర్డ్ డీఎస్పీ కొండారెడ్డి, కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ నాగభూషణం, వాకర్స్ కో-ఆర్డినేటర్ న్యాయవాది జీవన్ సింగ్ పిలుపునిచ్చారు.

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదివారం ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, చిన్నారులు, అథ్లెట్లు మరియు వాకర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని మైదానంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.

స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ సిటిజెన్లు జర్నలిస్టులు

​ఈ సందర్భంగా జీవన్ సింగ్ మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్, క్రీడల కోసం వచ్చే వందలాది మంది ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇళ్లను ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో, అదే విధంగా పార్కులు, ఆట స్థలాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, వాటర్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయవద్దని విద్యార్థులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మైదానాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు నాయకులు

​ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి జోనాథన్ వీక్లిఫ్, పీడీ కమ్మిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహిళా అథ్లెట్లు సీమ, విజయలక్ష్మి, విశ్రాంత ఉద్యోగులు రాజు రెడ్డి, వీరేష్ స్వామి, లింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు హుస్సేన్ భాష, రఘునాథ్ రెడ్డి, టిప్పు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు విద్యార్థినిలు
స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న అడ్వకేట్ జీవన్ సింగ్
Back To Top