News
సెప్టెంబర్ 2నుంచి విజయవాడ వెళ్ళే పలు రైళ్లు రద్దు
దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడ డివిజన్ లో కూడా పనులు జరుగుతుండటంతో వచ్చేనెల రెండోతేదీ నుంచి 29వ తేదీ వరకు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు.
మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని విజయవాడ డివిజన్ అధికారులు కోరారు.
విజయవాడ, రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దయిన రైళ్లు
మచిలీపట్నం-విజయవాడ (07896)
విజయవాడ-మచిలీపట్నం (07769),
నర్సాపూర్-విజయవాడ (07863),
విజయవాడ-మచిలీపట్నం (07866),
మచిలీపట్నం-విజయవాడ (07770),
విజయవాడ-భీమవరం జంక్షన్ (07283),
మచిలీపట్నం-విజయవాడ (07870),
విజయవాడ-నర్సాపూర్ (07861)
గుణదల, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించిన రైళ్ల వివరాలు
సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో ఎర్నాకుళం – పాట్నా (22643)
సెప్టెంబరు 7, 14, 21, 28 తేదీల్లో భావ్ నగర్ – కాకినాడపోర్ట్ (12756)
సెప్టెంబరు 4, 6, 11, 13, 18, 20, 25, 27 తేదీల్లో బెంగళూరు – గౌహతి (12509) రైళ్లను దారి మళ్లించారు.
సెప్టెంబరు 2, 4, 6, 7, 9, 11, 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ – భువనేశ్వర్ (11019)
సెప్టెంబరు 2 నుంచి 29వరకు ధన్‌బాద్ – అలెప్పి (13351)
సెప్టెంబరు 5, 12, 19, 26తేదీల్లో టాటా – యశ్వంత్‌పూర్ (18111)
సెప్టెంబరు 4, 11, 18, 25 తేదీల్లో జసిధి(జార్కండ్) – తాంబరం (12376)
సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో హాతియా – ఎర్నాకుళం (22837)
సెప్టెంబరు 7, 14, 21, 28 తేదీల్లో హాతియా – బెంగళూరు (18637)
సెప్టెంబరు 3, 8, 10, 15, 17, 22, 24, 29 తేదీల్లో హాతియా – బెంగళూరు (12835)
సెప్టెంబరు 6, 13, 20, 27 తేదీల్లో టాటా – హాతియా (12889)
ఈ తేదీల్లో ప్రయాణికులు దారి మళ్లించిన రైళ్ల మార్గాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. విజయవాడ-గూడూరు డివిజన్ మధ్య, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆయా మార్గాల్లో కూడా కొన్నింటిని అధికారులు రద్దు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కొన్నింటిని పునరుద్ధరించారు.
News
సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:
- వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
- ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
- తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
News
పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
ఆదోని, ఫిబ్రవరి 18:
ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే? కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
News
నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.
ఘటన వివరాలు:
పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
భారీగా ఊట ధ్వంసం:
పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నిందితుడి గుర్తింపు:
పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

-
News2 weeks agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News2 weeks agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News2 weeks agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News2 weeks agoపోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News2 weeks agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News1 week agoసహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
-
News2 weeks agoనాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
