News
పరీక్ష వ్రాయటానికి యజ్ఞోపవీతాన్ని అవమానించరు.. బ్రాహ్మణ, పురోహిత సంఘం
కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర పురోహిత సమాఖ్య అధ్యక్షుడు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ సంస్థాపన వ్యవస్థాపనకు మూలాధారమై వేద ధర్మానికి ప్రతినిధిగా సనాతన ధర్మ సంస్థాపన సూత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని అవమానపరుస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బీదర్, షిమోగా పట్టాన లాంటి ప్రాంతాలలో సెట్ పరీక్షలు రాయటానికి వెళ్ళినటువంటి బ్రాహ్మణ విద్యార్థులను ఘోరంగా అవమానపరుస్తూ యజ్ఞోపవీతాన్ని తొలగిస్తేనే పరీక్ష రాయటానికి అనుమతిస్తామని యజ్ఞోపవీతాన్ని కత్తిరించి డస్ట్ బిన్లలో వేయించిన తర్వాత పరీక్ష వ్రాయటానికి అనుమతించడాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ, సమాఖ్య పురోహిత విభాగం తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

ప్రభుత్వాల దృష్టిలో యజ్ఞోపవీతం అంటే తొమ్మిది దారాల బలమై ఉండవచ్చేమో కానీ హిందూ ధర్మం ప్రకారం వేదాలలో యజ్ఞోపవీతానికి ఇచ్చినటువంటి అర్థం ఏమిటో తెలియదు అనుకుంటాను మానవుడు ధర్మబద్ధంగా జీవించి మోక్షం వైపు నడవడానికి మూలాధారమై బుద్ధిని జ్ఞానాన్ని తేజస్సును వర్చస్సును ఆరోగ్యాన్ని పవిత్రతను ఆయుష్షును పెంపొందించే సూత్రం యజ్ఞోపవీతం. ఈ యజ్ఞోపవీతంలో ఉండే తొమ్మిది సూత్రాలు తొమ్మిది పరమపవిత్రమైన శక్తులు. ఓంకార అగ్ని నాగ సోమ పితృ ప్రజాపతి వాయు సూర్య విశ్వేదేవతత్వములు 9 ధార పోగులలో నిబిడి కృతమై ఉంటాయని తెలిపారు. ఈ యజ్ఞోపవీతాన్ని దారుణంగా అవమానించిన ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ యజ్ఞోపవీతం తీయవలసి వస్తుంది అని పరీక్షనే వదులుకున్నటువంటి విద్యార్థులకు తిరిగి పరీక్షలు వ్రాయించాలని డిమాండ్ చేశారు. వేదాన్ని వేద ధర్మాన్ని మఠాలను పీఠాలను అవమానపరిచే ఏ ప్రభుత్వాలకు మనుగడ ఉండదని ఇంతకు పూర్వం ఇదేవిధంగా వేద ధర్మాన్నిఅవమానించి తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొన్న రాష్ట్రాల అనుభవాలను గుర్తు చేశారు.
News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
News
రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి
ఆదోని 08 మే 2026
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను ఆదోని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కోరారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు, చిన్న ట్రాక్టర్లు, తైవాన్ స్ప్రేయర్లు మరియు వివిధ రకాల ట్రాక్టర్ అనుబంధ పరికరాలు రాయితీపై అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
అర్హతలు మరియు నిబంధనలు:
భూమి కలిగిన రైతులు మరియు RoFR రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, గత మూడు సంవత్సరాలలో కనీసం మూడు పంట సీజన్లకు e-Pantaలో నమోదైన CCRC రైతులు కూడా అర్హులు. అయితే, 2024-25 సంవత్సరంలో ఇప్పటికే సబ్సిడీ పొందిన వారు మళ్ళీ దరఖాస్తు చేయడానికి వీలుండదు. ప్రతి కుటుంబం నుండి ఒకరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
సబ్సిడీ వివరాలు:
SC, ST వర్గాలకు చెందిన వారు, మహిళా రైతులు మరియు చిన్న, సన్నకారు రైతులకు యంత్రం ధరలో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇతర రైతులకు 40 శాతం వరకు రాయితీ ఉంటుంది. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఒకటి లేదా రెండు పరికరాలను ఎంపిక చేసుకోవచ్చు.

ఎంపిక మరియు చెల్లింపు విధానం:
రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల (RSK సిబ్బంది) సహకారంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాక్టర్ పరికరాల కోసం దరఖాస్తు చేసే వారు ట్రాక్టర్ RC కాపీని తప్పనిసరిగా జతచేయాలి. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన రైతులకు SMS ద్వారా సమాచారం అందుతుంది. ఎంపికైన వారు 15 రోజుల్లోగా తమ వాటా సొమ్మును ఆన్‌లైన్ ద్వారా డీలర్ ఖాతాకు చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన గడువు తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19-05-2026 చివరి తేదీ. ఎంపిక ప్రక్రియ (లాటరీ) మే 23 నుండి 25 వరకు జరుగుతుంది. ఎంపికైన రైతులు మే 26 నుండి జూన్ 9వ తేదీ లోపు నగదు చెల్లించాలి. మే 26 నుండి జూన్ 26వ తేదీ లోపు రైతులకు యంత్రాల సరఫరా జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు.