పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం బసాపురం ఎస్ ఎస్ బ్యాంక్ సమీపంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జయ మనోజ్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జయ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ 5 ఎకరాల్లో సుమారు 800 మొక్కలను నాటినట్లు తెలిపారు. ఎన్ఆర్జిఎస్ ఫండ్ ఉపాధి హామీ పథకం మరియు సెంట్రల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఫండ్స్ ఇస్తుందని దీని ద్వారా రాష్ట్రమంతా పచ్చ తోరణం గా మారుతుందని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గీతావాణి, మున్సిపల్ చైర్ పర్సన్ శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.

మొక్కలను నాటుతున్న జయం మనోజ్ రెడ్డి
జగనన్న పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న జయ మనోజ్
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version