Connect with us

News

ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించరు. ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 42వ వార్డు కౌన్సిలర్ సి. హెచ్. లోకేశ్వరి చైర్ పర్సన్ పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా 36 వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి ప్రతిపాదించరు మరియు 40 వార్డు కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్  బలపరచడంతో సి. హెచ్. లోకేశ్వరి ఏకగ్రీవంగా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.

పూర్తి వీడియో చూడాలంటే దీనిపై క్లిక్ చేయండి

ఈ  ఎన్నికలకు 36 మంది వార్డు కౌన్సిలర్లు మరియు  ఎమ్మెల్సీ డాక్టర్. మధుసూదన్ పాల్గొన్నారు.
అనంతరం, ప్రెసిడింగ్ ఆఫీసర్ & సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సి. హెచ్. లోకేశ్వరి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య పాల్గొన్నారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

కౌన్సిల్ హాల్ లో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూద మరియు కౌన్సిలర్లు
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా సి. హెచ్. లోకేశ్వరి
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్ర జలాశయానికి భారీగా పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 07.08.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 07 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1622.55 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 68.776 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున   47559 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 43814 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1497 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 74.486 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

తుంగభద్ర జలాశయానికి భారీగా పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 06.08.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 06 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1621.22 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున   60751 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 50500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1449 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 74.979 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ధనాపురం, నారాయణపురం గ్రామాల్లో ఇటీవల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. శివరామకృష్ణ, డాక్టర్ ఎస్. ఐసా పర్వీన్, డాక్టర్ ఎస్. రమాదేవి మరియు అధికారులు రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రత్యామ్నాయ పంటలు: […]

Published

on

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ధనాపురం, నారాయణపురం గ్రామాల్లో ఇటీవల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. శివరామకృష్ణ, డాక్టర్ ఎస్. ఐసా పర్వీన్, డాక్టర్ ఎస్. రమాదేవి మరియు అధికారులు రైతులకు పలు కీలక సూచనలు చేశారు.

రైతులకు అవగాహన కలిగిస్తున్న వ్యవసాయ అధికారులు

ప్రత్యామ్నాయ పంటలు: నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి. పంట బీమా తప్పనిసరి: ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాల నుంచి రక్షణ పొందడానికి ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలి. తేమ సంరక్షణ: నేలలో తేమను కాపాడుకునే పద్ధతులు పాటించాలి. సమతుల్య ఎరువుల వాడకం, కలుపు నివారణ, సరైన సమయంలో యాజమాన్య చర్యలు చేపడితే దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు. పత్తి పంటకు స్ప్రే: ఎండ తీవ్రత, బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి పత్తి పంటపై లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13:0:45) లేదా 10 గ్రాముల 19:19:19 నీటిలో కరిగే ఎరువును కలిపి పిచికారీ చేయాలి.హెచ్చరికలను గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవికె అధికారి నిరంజన్, వ్యవసాయ విస్తరణ అధికారి పి. సతీష్, గ్రామ వ్యవసాయ సహాయకులు నళిని, హరి రామ్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Continue Reading

Trending