వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ముద్దాయిగా విచారణలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి కేసులు సిబిఐ వార్త కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై, కెమెరామెన్ పై దాడి చేసిన వారిని, ప్రోత్సహించిన అవినాష్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని శుక్రవారం సబ్ కలెక్టర్ కు రామాంజనేయులు వెంకటేష్ మాల రవి రామంజి వినతి పత్రం అందజేశారు. వివేకానంద రెడ్డిని సిబిఐ అధికారులు విచారణకు పిలవడం జరిగిందని గుర్తు చేశారు. తన తల్లికి బాగాలేదని విచారణకు హాజరు కాలనీ లాయర్లకు చెప్పి పులివెందులకు బయలుదేరిన విషయాన్ని చెప్పుకొచ్చారు. అనుమానం వచ్చి అవినాష్ రెడ్డినీ సిబిఐ అధికారులు వెంబడించడంతో వార్తకు కవరేజ్ చేయడానికి వెళ్లిన పాత్రికేయులపై దాడి పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. పాత్రికేయుల వాహనాలు ధ్వంసం చేయడమే కాకుండా కెమెరాలను ధ్వంసం చేసి అడ్డుకోబోయిన రిపోర్టర్స్ పై భౌతిక దాడి చేయడం ప్రజాస్వామ్యం బతికుందా అంటూ ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య విషయంపై ఏమి జరుగుతుందో ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయాన్ని అందరికి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులపై దాడికి పాల్పడడం బావ స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించారు. తక్షణమే ఎంపీ అవినాష్ రెడ్డి పై కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.