Connect with us

News

మట్కా రాస్తున్న ముగ్గురు అరెస్ట్ 1,20,000 నగదు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కారాస్తున్న ముగ్గురు అరెస్ట్. ఒకరు పరార్. వారి వద్ద నుండి 1 లక్ష 20 వేల నగదు 15 లీటర్ల నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకొన్నరు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జామియా మసీదు వెనకాల ఇంట్లో మట్కా రస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి మట్కా బీటర్లు చందాసాహేబ్ దర్గా వద్ద నివాసం ఉండే ఇస్మాయల్ , చౌకి మఠం నివాసి ఐన కన్నయ్య మరియు బబ్బులమ్మ గుడి వద్ద నివాసముండే శ్రీనివాసులు ముగ్గురిని అరెస్ట్ చేశామని మరో ఒకరు SKD కాలనీ కి చెందిన ఇక్బాల్ పరారీలో యూన్నాడని సిఐ విక్రమ సింహ తెలిపారు. వారి వద్దనుండి మట్కా చీటీలు, రూ. 1,20,000/- డబ్బులను, 15 లీటర్ల నిషేధిత నాటు సారాయ్ స్వాధీనం చేసుకొని ముగ్గురి కేసునమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో 1 టౌన్ CI విక్రమసింహ, సిబ్బంది రంగస్వామి, HC మద్దిలేటి , సుధీర్ , మధు, వెంకటేష్ మరియ ముస్తాక్ లు పాల్గొన్నారు….

మట్కా నిర్వాహకుల అరెస్టు చూపిస్తున్న సి ఐ విక్రమ సింహ

ప్రజలకు పోలీసువారి విన్నపం..
దయచేసి అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్ , పేకాట ల గురించి మీకు తెలిస్తే కింది నెంబర్ సమాచారం ఇవ్వాలని
9121101135
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును అని సిఐ విక్రమ సింహ తెలిపారు.

యూట్యూబ్ వీడియో
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

పత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు

Published

on

కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కర్నూలు లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ ఎస్. ఏం. డి. గౌస్ సోమవారం 24 వ తేదీ న పత్తి వ్యాపారుల కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు వరుసగా కోడుమూరు మండలం వర్కూరు గ్రామం లో హెచ్. హనుమంతు, ఎమ్మిగనూరు ప్రాంతంలోని షేక్షావల్లి కాటన్, ఈరన్న ఫుడ్ గ్రెయిన్స్, గౌస్ కాటన్ ట్రేడర్స్, గిడయ్య కాటన్, ఆశా ట్రేడర్స్, HKGN కాటన్ మర్చెంట్, శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ (కర్నూల్ రోడ్, ఎమ్మిగనూరు) లో జరిగినవి. ఈ తనిఖీలలో పలువురు వ్యాపారులు వినియోగిస్తున్న తూకపు యంత్రాలకు రీస్టాంపింగ్ గడువు పూర్తయ్యినట్టు గుర్తించడమే కాకుండా, 10 కేజీల తుకనికి 1,200 గ్రాములు తక్కువగా చూపిన ఘటనలు నమోదైనవి. ఈ నేపథ్యంలో లీగల్ మెట్రాలజీ చట్టం, 2009 సెక్షన్ 8/25 మరియు 30 ప్రకారం 2 కేసులు నమోదు చేసి, రూ. 35,000 జరిమానా విధించారు. రైతులకు కాటన్ కొనుగోలు తూకా విధానంపై అవగాహన కల్పించారు.

తనిఖీలు చేస్తున్న లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్, ఇన్స్పెక్టర్ ఎస్ ఎం డి గౌస్

అదేవిధంగా ప్రతీ వ్యాపారుడు తాను వాడుతున్న తూకపు యంత్రాలను లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా సరిచూసుకుని, వెరిఫికేషన్ సర్టిఫికేట్ వ్యాపారం వద్ద ప్రదర్శించాల్సిన అవసరం ఉందని సూచించారు. లీగల్ మెట్రాలజీ శాఖ ముద్ర సర్టిఫికేట్ లేని యంత్రాలు వాడితే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు, రైతులు తూకపు యంత్రాలపై శాఖ ముద్ర ఉందా అని చూసుకోవాలని తెలిపారు. వరుసగా తనిఖీలు కొనసాగిస్తామని లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్, ఇన్స్పెక్టర్ ఎస్ ఎం డి గౌస్ తెలియజేశారు.

తూకాలను పరిశీలిస్తున్న లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్, ఇన్స్పెక్టర్ ఎస్ ఎం డి గౌస్
Continue Reading

News

మత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు

Published

on

మద్యం మత్తులో వాహనాలు నడిపితే తీవ్రమైన శిక్షలు తప్పవని మరోసారి రుజువు అయ్యింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లో పట్టుబడిన వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచిన పోలీసులు

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లో పట్టుబడిన 15 మందిని పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వారిలో ట్రాఫిక్ పోలీసులు నలుగురిని, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మందిని అదుపులోకి తీసుకుని కోర్టు లో హాజరు పరుచగా విచారణ అనంతరం న్యాయమూర్తి 4 గురికి ఒక వారం రోజులు, 5 గురికి 30 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదోని సబ్ జైలుకు తరలించరు. 6గురికి 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించరు. రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకులు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో పాటు, అన్ని రకాల వాహనాలను నడిపే వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను రోడ్డుపై నడపవద్దని, ఇది చాలా ప్రమాదకరమని ఇకపై ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో పట్టుపడితే ఇదే విధమైన జైలు శిక్ష తప్పదని ఆదోని పోలీసులు హెచ్చరించరు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లో పట్టుబడిన వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచిన పోలీసులు
Continue Reading

News

ఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో ఆస్పరి బైపాస్ రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని AP 04 V 1430 నంబర్‌గల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఢీ కొట్టిన లారీ ఫోటో
Continue Reading

Trending