News
మౌలిక సదుపాయాలు కల్పించాలి. CPM పార్టీ
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో త్రాగునీరు, రోడ్లు, స్మశాన వాటిక సమస్యలు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం ముందు CPM పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సభ్యులు ఉచ్చిరప్ప అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో జనార్ధన్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. లింగన్న, కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి మాట్లాడుతూ
ఆదోని మండలంలో త్రాగునీరు సమస్య పరిష్కారానికి
1. నెమలికల్ ఎస్ ఎస్ ట్యాంక్ నుండి బసరకోడు వరకు అదనపు పైప్ లైన్, కుప్పగల్లు ఎస్ ఎస్ ట్యాంక్ నుండి పాండవగల్లు వరకు అదనపు పైప్ లైన్ వేయాలి..
2. హనుమాన్ స్కీం దగ్గర మరియు కుప్పగల్ స్కీం దగ్గర దగ్గర ఫిల్టర్ బెడ్లు ఏర్పాట్లు చేయాలి..
3. పెద్ద తుంబలం ఎస్ఎస్ ట్యాంక్ వెడల్పు చేయాలి..
4. చిన్న హరివాణం ఎస్ఎస్ ట్యాంక్ నుండి సంతే కుల్లూరు మరియు పెద్ద హరివాణం వరకు పైప్ లైన్ వేయాలి..
5. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్ల సమస్యలు పరిష్కరించాలి..
6. గనేకల్ కుప్పగల్లు, నారాయణపురం గ్రామాలలో స్మశాన వాటిక సమస్యలు పరిష్కరించాలి..
7. అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి..
8. గణేకల్లు, బల్లెకల్ గ్రామాలలో జడ్పీ స్కూళ్ళ లో టీచర్ల కొరత తీర్చాలి..
9. బల్లె కల్లు, పెద్ద తుంబలం గ్రామాల్లో జడ్పీ స్కూళ్ళకు రోడ్లు వేయాలి..
10. పాండవగల్ మండల పరిషత్ స్కూల్ కి సిసి రోడ్డు, డ్రైనేజీ వేయాలి..
11. పాండవగల్లు, గోనబావి గ్రామాల్లో ఆక్రమణకు గురైన చెరువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి..
12. ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా అన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు వీధిలైట్లు వేయాలి..
తెలిపిన 12 డిమాండ్లను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు భాష, పాండురంగ, తిక్కప్ప శాఖ కార్యదర్శులు అనిఫ్ భాష, రామాంజనేయులు, తాయన్న, తిక్కన్న, గ్రామాల పార్టీ సభ్యులు మరియు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




