పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న, కెవిపిఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి. తిక్కప్ప మాట్లాడుతూ కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఐదు వారాలు పైగా ఉపాధి బిల్లులు పెండింగ్ ఉన్నాయని, బిల్లులు చెల్లింపులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మర్ అలవెన్స్, గడ్డపార సాన పెట్టుకోవడానికి వేతనం కొనసాగించాలని, అదేవిధంగా ఉపాధి కూలీలకు త్రాగడానికి నీరు, నీడ, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఉపాధి కూలీలను సమీకరించి మే నెల 22వ తేదీన పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకొంటున్న నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *