News
ముఖ్యమైన వార్తలు

15వ తేదీ శనివారం ఫిబ్రవరి 2025 నలుదిక్కుల ముఖ్యమైన వార్తలు..
◆ రాజమండ్రిలో నకిలీ కరెన్సీ పట్టివేత ఐదుగురి అరెస్ట్ కోటి రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం..
◆ సూర్యాపేట జిల్లా బొజ్జ గూడెం లో కూలీల ఆటో బోల్తా పదిమందికి గాయాలు
◆ జనసేన నేత కిరణ్ రాయల్ బాగోతాలు.. ఆధారాలతో బయటపెట్టిన బాధితురాలు లక్ష్మి.. పవన్ కళ్యాణ్ అండతోనే రెచ్చిపోతున్నారని లక్ష్మీ ఆరోపణ..
◆ టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి పై కేసు..
ఫిర్యాదు చేసిన సినీ నటి మాధవి లత..
అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోహణంలు..
◆ ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలి..
ప్రజల తరఫున పోరాటం చేస్తామన్న ఎమ్మెల్సీ కల్పిత..
◆ భక్తజన కేంద్రంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ.. పుణ్యస్నానాలు ఆచరించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్..
◆ ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన డికే అరుణ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీకే అరుణ..
◆ మోడీపై మాట్లాడితే గొప్ప వాలం అవుతం అనుకుటున్నారు..
సీఎం రేవంత్ రెడ్డి పై బిజెపి ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు..
◆ ఇవ్వాలి ఇవాళతో ముగియనున్న మస్తాన్ సాయి కస్టడీ..
కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు..
◆ నారాయణపేట జిల్లా మక్తల్ లో ఘరానా మోసం షేర్ మార్కెట్ పేరిట 100 కోట్లు దండుకున్న సేటుగాడు.. నెల్లూరు జిల్లా కావలిలో పట్టుబడ్డ సుభాని..
◆ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఆక్రమణల కూల్చివేత.. అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసిన జిహెచ్ఎంసి అధికారులు..
◆ ప్రకాశం జిల్లా కంభం లో దారుణం.. కొడుకును ముక్కలుగా నరికి చంపిన తల్లి.. సంచుల్లో పెట్టి కాలువలో పడేసిన సాలమ్మ..
◆ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం.. కాంటాక్ట్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. న్యాయం చేయాలంటూ స్థానికులు రోడ్డుపై ఆందోళన..
◆ అల్లూరి జిల్లా వేలువాయిలో గిరిజనుల నివాసాలు కూల్చివేత.. పట్టా భూముల్ని ఆక్రమించారని నిర్మాణాలకు తొలగింపు.. ◆తమిళనాడులో ఈనెల 28న ప్రధాని మోడీ పర్యటన.. రామేశ్వరంలోని న్యూ పోమ్బన్ బ్రిడ్జ్ కు ప్రారంభోత్సవం..
◆ యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న బొలెరో వాహనం పదిమంది మృతి.. మహాకుంభమేళాకు వెళ్తుండగా ఘటన..
◆ యూపీ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపతి మురుమన్ దిగ్బ్రాంతి.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన రాష్ట్రపతి..
◆అక్రమ వలసదారులపై అమెరికా కొరడా.. మరో 119 మంది భారతీయుల తరలింపు..
◆ వలస విమానాలు పంజాబ్లో ల్యాండింగ్ పై వివాదం.. భారత్ పరువు తీస్తున్నారు అన్న సీఎం భగవంత్ మాన్..
◆ డాలర్ విలువను తగ్గించాలని చూస్తే 100% ట్యరీప్.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక..
◆ బంగారం ప్రియులకు భారీ ఊరట.. 10 గ్రాముల పై 1100 రూపాయల తగ్గుదల..
◆ 2007 తర్వాత తొలిసారి లాభాలలో బిఎస్ఎన్ఎల్ క్యూ3 లో 262 కోట్లు లాభాలు..
News
ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు. ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే భోజనం చేశారు.

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


-
News4 weeks ago
హెచ్ పి గ్యాస్ సిలిండర్లు సీజ్
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర