News
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కోటి రూపాయలు విలువచేసే నగదు వాహనాలు సీజ్..
◆ ఆదోనిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ◆ ముఠా నలుగురు సభ్యులను అరెస్ట్..
◆ నిందితుల నుంచి 80 లక్షలు నగదు స్వాధీనం ఒక కారు రెండు బైకులు సీజ్
◆ పరారీలో మరో ఆరుగురు నిందితులు..
◆ వివరాలు వెల్లడించిన డిఎస్పి శివ నారాయణస్వామి
కర్నూలు జిల్లా ఆదోని పోలీస్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 80 లక్షల నగదు ఒక కారు, రెండు స్కూటర్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శివ నారాయణ స్వామి వివరాల మేరకు 2వ ముద్దాయి పింజరి హుస్సేన్ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేసి నలుగురు బోయ మహానంది, పింజరి హుస్సేన్, మహమ్మద్ ఖాసిం, వడ్ల రాఘవేంద్ర క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశామని తెలిపారు. 4వ ముద్దాయి వడ్ల రాఘవేంద్ర గత ఐదు సంవత్సరాలుగా అక్రమంగా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ఈ బెట్టింగ్ వ్యవహారం నిర్వహిస్తున్నాడని డిఎస్పి తెలిపారు. మిగతా ముగ్గురు ముద్దాయిలు గత మూడు సంవత్సరాల నుంచి అతనితో కలిసి ఈ బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తున్నారని మొదటి ముద్దాయి బోయ మహానంది పై 8 కేసులు ఉన్నాయని, 2వ ముద్దాయి పింజరి హుస్సేన్ పై 6 కేసులు, 3వ ముద్దాయి గింజరి మొహమ్మద్ ఖాసిం పై 4 కేసులు 4గో ముద్దాయి వడ్ల రాఘవేంద్ర చారి పై 4 కేసులు పట్టణంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై కేసులు ఉన్నాయని డిఎస్పి వెల్లడించారు. వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న నగదు, వాహనాలు వీటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
ఈ దాడుల్లో పాల్గొన్న సిఐ శ్రీరామ్ ఎస్సై జయ శేఖర్ ఎస్సై చిన్న పీరయ్య సిబ్బంది నరేంద్ర మధు సోమేశ్ ఖాసిం వలి నరసింహ మంజు కుమార్ మురళి పోలీసులకు ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివ నారాయణ స్వామి రివార్డులను అందజేశారు.
News
తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు
హోస్పేట: 09.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 09 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1624.74 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 75.644 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 40799 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 40500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1525 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 81.538 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
News
విశ్వనారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలి: పిడిఎస్‌యు డిమాండ్
కర్నూలు జిల్లా ఆదోని : ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న విశ్వనారాయణ కళాశాలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) డిమాండ్ చేసింది. స్థానిక కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడారు.
ఇంటర్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి ఒకే భవనంలో సాధారణ ఇంటర్, ఒకేషనల్ కోర్సులు నడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా కళాశాల నడుస్తోందన్నారు. తరగతులు జరుగుతుండగానే భవన నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నాయకులు బసవ, విష్ణు, ముని, గోవర్ధన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
News
మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. సాయి ప్రసాద్ రెడ్డి
కర్నూలు జిల్లా ఆదోని: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదోనిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, యూత్ విభాగం, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… మెగా డీఎస్సీ నిర్వహణపై అనేక అనుమానాలు, […]
కర్నూలు జిల్లా ఆదోని: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదోనిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, యూత్ విభాగం, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… మెగా డీఎస్సీ నిర్వహణపై అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నందున దీనిపై స్వతంత్ర సంస్థ అయిన సీబీఐచే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు జరగకపోతే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. విద్యాశాఖ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రధాన డిమాండ్లు: ◆ సీబీఐ విచారణ: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి, ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి. ◆ నిరుద్యోగ భృతి: ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు ₹3,000 భృతిని వెంటనే విడుదల చేయాలి. ◆ ఫీజు రీయింబర్స్‌మెంట్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆదుకోవాలి.
ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు వెంకటేష్ రెడ్డి, జీవన్ సింగ్, ఫయాజ్ అహ్మద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
News4 weeks ago
కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks ago
నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్
-
News2 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News4 weeks ago
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
-
News4 weeks ago
పేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం
-
News2 weeks ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..