హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష

కర్నూలు జిల్లా ఆదోని లో ముద్దాయి కురువ నాగేష్ కు హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష మరియు రూ.1,500/- లు జరిమాన విధిస్తూ తీర్పును వెల్లడించారు రెండవ అదనపు జిల్లా  జడ్జ్ టి.జె. సుధా. మద్యానికి బానిసై పనికి పోకుండా తిరుగుతుండడంతో భార్య జయలక్ష్మి పనికి పొమ్మని మందలించదాంతో 20.02.2024  నాగేశ్ రాత్రి అందరూ నిద్ర లో ఉన్నపుడు గొడ్డలితో భార్య కురువ జయలక్ష్మీని నరికి హతమార్చిడు. ఘటనకు సంబందించి కురువ జయలక్ష్మీ తండ్రి  కురువ యల్లప్ప ఫిర్యాదు మేరకు Cr.No. 27/2024 U/Sec 498 (a), 302 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు దీనిపై విచారణ జరిపిన రెండవ జిల్లా అదనపు కోర్టు గురువారం తీర్పును వెల్లడైంది.
పెద్దకడుబూరు SI P. నిరంజన్ రెడ్డి కేసుకు సంబందించిన సాక్షులను క్రమం తప్పకుండా వాయిదాలకు కోర్టులో హాజరు అయ్యేలా చూసి, ముద్దాయికి శిక్ష పడేలా చేశారు. అన్ని కోణాల్లో విచారించిన ఆదోని రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి ముద్దాయికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష మరియు రూ.1500/- లు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ముద్దాయికి శిక్ష పడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను, పెద్దకడుబూరు పోలీసులను, కోర్టుమానిటరింగ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందనలు తెలిపినట్టు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఆదోని అదనపు జిల్లా కోర్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version