Connect with us

News

భోగిమంటల్లో విద్యుత్ బిల్లులు వేసి నిరసన, సిపిఎం..

Published

on

రాష్ట్ర కమిటీ పిలుపులు భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పాండవగల్లు, కొత్తూరు దొడ్డనకేరి, ఆరెకల్లు, గ్రామాలలో విద్యుత్ బిల్లులను భోగిమంటల్లో వేసి దద్దం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, కార్యదర్శివర్గ సభ్యులు. రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు  ఎలాంటి కరెంటు చార్జీలు పెంచమని, చార్జీలు, యధావిధిగా కొనసాగిస్తామని ఇచ్చిన మాటను తప్పారని, ఇప్పటికే ప్రజలపై సుమారు 18 వేల కోట్ల రూపాయలు భారం వేసారని, మళ్లీ భారం వేయడానికి ప్రజాప్రాయ సేకరణ చేపట్టారని, మళ్లీ విద్యుత్ చార్జీల పెంపదలను సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు అయ్యప్ప, పాండురంగ, కే మునిస్వామి, శాఖ కార్యదర్శిలు ఎస్ అనిఫ్, కర్ణ, పార్టీ సభ్యులు కృష్ణ, బీమా,  తాయన్న, యు. హనుమంత్ రెడ్డి, కే. హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరెంట్ బిల్లులను కాలుస్తున్న వీడియో
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిలిందంటూ ఫ్యాక్టరీ యాజమాని ప్రశాంత్ తెలిపారు. సుమారు 6 కోట్ల పత్తి, 2 కోట్ల పత్తి బెల్లు (600 బెల్లు), సుమారు కోటి రూపాయల పత్తి సీడ్, మోటర్లు పూర్తిగా దగ్ధమైందని యజమాని తెలిపారు. పత్తి ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి రెండు ఫైర్ ఇంజన్ తో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పత్తిని అమ్ముకోవడానికి తీసుకొచ్చిన రైతుల రెండు బొలెరో వాహనాలు కూడా కాలిపోవడం జరిగింది.  ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చోటుచేసుకుంద ని యాజమాని ప్రశాంత్ పేర్కొన్నారు.

సంతోష్ జిన్నింగ్ ఫ్యాక్టరీ
మంటలు అరుపుతున్న ఫైర్ సిబ్బంది
కాలిపోతున్న రైతుల బొలెరో వాహనం
Continue Reading

News

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం బసరకోడు గ్రామానికి నెలలో ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే మంచి నీళ్లు సరఫరా చేస్తున్నారని తాగునీటి సమస్య ఇప్పుడే తీవ్రంగా ఉంటె వేసవికాలంలో మరి తీవ్రం కాకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి కనీసం మూడు  రోజుల కు ఒకసారి మంచినీళ్లు సరఫరా చేయాలనిడిమాండ్ చేసిన డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఉర్చీరప్ప
వ్యవసాయ కార్మిక సంఘం హుసేని కెవిపిఎస్ రామాంజిని.. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.

త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
Continue Reading

News

నాటు సారా తయారీ బట్టీల ద్వంశం ముద్దాయిలు అరెస్టు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యెల్లమ్మ కొండలలో నాటు సారాయి తయారు చేస్తున్న నలుగురు ముద్దాయిలను A-1. బోయ సురేష్  (35), A-2. సంగ్రామ్ హబీబ్ బాష (45), A-3. బోయ అనిత (32), A-4. బోయ వెంకటేష్ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 30 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1000 లీటర్ల బెల్లం ఊట ద్వంశం చేసినట్టు వన్ టౌన్ సిఐ తెలిపారు.

బెల్లం ఊటను పారబోస్తున్న ఫోటో

వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO  సోమన్న వారి పర్యవేక్షణలో ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్ వారి సిబ్బంది 16వ తేదీ గురువారం యెల్లమ్మ కొండలలో అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒక మహిళను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారు అయినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 30 లీటర్ల నాటు సారాయి  ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  ఐదు ప్లాస్టిక్ డ్రమ్ములలో సుమారు 1000 లీటర్ల బెల్లం ఊటను పారబోసి డ్రమ్ములను మరియు బట్టీలను ద్వంశం చేసి కేసు నమోదు చేశామన్నారు. వారిని కోర్టుకు హాజరుపరచి రిమాండ్ కి తరలిస్తున్నట్లు సిఐ శ్రీరామ్ తెలిపారు.

బెల్లం ఊటను పారబోస్తున్న ఫోటో
Continue Reading

Trending