News
ఎమ్మెల్యే విరూపాక్షి బెయిల్ పిటిషన్ పై రేపు ఆదోని కోర్టు లో విచారణ
ఆదోని, ఆగస్టు 12:
ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు విరూపాక్షి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు (ఆగస్టు 13, గురువారం) కోర్టులో విచారణ జరగనుంది. నేమకల్లు గ్రామానికి చెందిన ఒక ఎస్సీ మహిళపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే విరూపాక్షి మరియు ఆయన సోదరుడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయపరమైన ఉపశమనం కోసం వారు ఆదోనిలోని 2వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టును ఆశ్రయించారు.
ఉభయ పక్షాల వాదనలు విన్న అనంతరం బెయిల్ మంజూరుపై న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని వెల్లడించనుండటంతో రేపటి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News
వైఎస్ఆర్‌సీపీ పట్టణాధ్యక్షుడు దేవాకు టూ టౌన్ పోలీసులు నోటీసులు జారీ
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్‌సీపీ పట్టణాధ్యక్షుడు బోయ దేవాకు టూ టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11న నమోదైన FIR No.152/2026 కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. BNS సెక్షన్లు 126(2), 189(2), 292 r/w 190 కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం రెండు రోజుల్లోగా తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. హాజరయ్యే సమయంలో గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రాలతో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను సమర్పించాలని సూచించారు.
నోటీసులోని ముఖ్య అంశాలు: ◆ విచారణకు సహకారం: కేసు దర్యాప్తులో భాగంగా దేవాను ప్రశ్నించాల్సి ఉన్నందున విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలి. ◆ ఆధారాల సమర్పణ: కేసుకు సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలను పోలీసులకు అందజేయాలి. ◆ షరతులు: భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సంబంధిత వ్యక్తులను బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటివి చేయరాదని పోలీసులు స్పష్టం చేశారు. ◆ కోర్టు ఆదేశాలు: అవసరమైన సమయంలో కోర్టుకు మరియు చట్ట ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్‌సీపీ పట్టణాధ్యక్షుడు బోయ దేవాకు పోలీసు నోటీసులు జారీ కావడం ఆదోని స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
News
తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు
హోస్పేట: 12.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 12 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1627.61 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 85.359 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 34051 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 31431 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1680 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 87.123 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
News
అదోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
◆ కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు ◆ రామ్‌జలా, జైన్ టెంపుల్, పెద్దతుంబలం రామాలయం సందర్శన ◆ మౌలిక వసతుల కల్పనకు త్వరలోనే ప్రతిపాదనలు
కర్నూలు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల తో అదోని డివిజన్ ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను మంగళవారం అదోని ఆర్డీఓ వివిధ శాఖల అధికారులు ఉమ్మడిగా పర్యటన నిర్వహించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రామ్‌జలా, జైన దేవాలయం, పెద్దతుంబలం ప్రాచీన రామాలయం, చిన్నతుంబలం చెరువు తదితర ప్రాంతాలను సందర్శించి, అక్కడి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.
పర్యాటకులను ఆకర్షించేలా చేపటాల్సిన అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా అధికారులు చర్చించారు. ముఖ్యంగా మెరుగైన రహదారి సౌకర్యాలు, తాగునీటి సరఫరా పరిసరాల పారిశుధ్యం, వ్యర్థాల నియంత్రణ, సందర్శకుల కోసం ప్రయాణ, విశ్రాంతి సౌకర్యాలుఆయా ప్రాంతాల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడుతూ పర్యాటకులకు అనుకూలంగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ఈ ప్రదేశాలలో అభివృద్ధి పనులను గుర్తించి, సమగ్ర నివేదికలు ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో అదోని ఆర్డీఓతో పాటు ఎంఆర్‌ఓ (తహశీల్దార్), మున్సిపల్ కమిషనర్, జిల్లా పర్యాటక శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు మరియు యంగ్ ప్రొఫెషనల్ తదితరులు పాల్గొన్నారు.
-
News3 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News4 weeks ago
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
-
News3 weeks ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..
-
News3 weeks ago
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
-
News4 weeks ago
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
-
News4 weeks ago
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
-
News5 days ago
ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
-
News3 weeks ago
ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి