News
అదోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
◆ కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు ◆ రామ్‌జలా, జైన్ టెంపుల్, పెద్దతుంబలం రామాలయం సందర్శన ◆ మౌలిక వసతుల కల్పనకు త్వరలోనే ప్రతిపాదనలు
కర్నూలు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల తో అదోని డివిజన్ ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను మంగళవారం అదోని ఆర్డీఓ వివిధ శాఖల అధికారులు ఉమ్మడిగా పర్యటన నిర్వహించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రామ్‌జలా, జైన దేవాలయం, పెద్దతుంబలం ప్రాచీన రామాలయం, చిన్నతుంబలం చెరువు తదితర ప్రాంతాలను సందర్శించి, అక్కడి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.
పర్యాటకులను ఆకర్షించేలా చేపటాల్సిన అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా అధికారులు చర్చించారు. ముఖ్యంగా మెరుగైన రహదారి సౌకర్యాలు, తాగునీటి సరఫరా పరిసరాల పారిశుధ్యం, వ్యర్థాల నియంత్రణ, సందర్శకుల కోసం ప్రయాణ, విశ్రాంతి సౌకర్యాలుఆయా ప్రాంతాల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడుతూ పర్యాటకులకు అనుకూలంగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ఈ ప్రదేశాలలో అభివృద్ధి పనులను గుర్తించి, సమగ్ర నివేదికలు ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో అదోని ఆర్డీఓతో పాటు ఎంఆర్‌ఓ (తహశీల్దార్), మున్సిపల్ కమిషనర్, జిల్లా పర్యాటక శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు మరియు యంగ్ ప్రొఫెషనల్ తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని విశ్వనారాయణ కళాశాల ఎదుట PDSU ధర్నా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విశ్వనారాయణ కళాశాల ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు అఖండ, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విశ్వనారాయణ కళాశాల యాజమాన్యం ఒకే భవనంలో ఇంటర్, ఒకేషనల్, పల్లవి పారామెడికల్ కళాశాలలను నడుపుతోందని మండిపడ్డారు. పారామెడికల్ కళాశాలకు అనుమతిఎస్.కె.డి కాలనీ చిరునామాతో పొంది, అధికారుల కళ్లు గప్పి విశ్వనారాయణ కాలేజీ బిల్డింగ్‌లోనే తరగతులు […]
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విశ్వనారాయణ కళాశాల ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు అఖండ, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విశ్వనారాయణ కళాశాల యాజమాన్యం ఒకే భవనంలో ఇంటర్, ఒకేషనల్, పల్లవి పారామెడికల్ కళాశాలలను నడుపుతోందని మండిపడ్డారు. పారామెడికల్ కళాశాలకు అనుమతిఎస్.కె.డి కాలనీ చిరునామాతో పొంది, అధికారుల కళ్లు గప్పి విశ్వనారాయణ కాలేజీ బిల్డింగ్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పారామెడికల్ బోర్డు అనుమతి పత్రం (పర్మిషన్ బోర్డు) కూడా లేకుండానే విద్యార్థుల వద్ద భారీగా ఫీజులు వసూలు చేశారని తెలిపారు. కాలేజీ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తరగతులు ప్రారంభించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.
అంతేకాకుండా తరగతులు జరుగుతున్న సమయంలోనే అదే భవనంపై నిర్మాణాలు (కన్స్ట్రక్షన్) చేపడుతున్నారని, దీనివల్ల విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న విశ్వనారాయణ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు, ఏపీ పారామెడికల్ బోర్డు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పి.డి.ఎస్.యు మండల నాయకులు బసవ, విష్ణు, ముని, గోవర్ధన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోనికి 6 కొత్త ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు
కర్నూలు జిల్లా ఆదోని ఎంసిహెచ్ (MCH) ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మంగళవారం నూతనంగా మంజూరైన 102 ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాల ను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రిబ్బన్ కట్ చేసి నూతన వాహనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదోని నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం మొత్తం 6 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. కర్నూలు జిల్లాలోనే అత్యధిక ప్రసవాలు జరిగే ఆసుపత్రుల్లో ఆదోని ఎంసిహెచ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రసవం అనంతరం బాలింతలను, పసిపాపలను సురక్షితంగా, ఉచితంగా ఇంటికి చేర్చేందుకు ఈ వాహనాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని తల్లులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంసిహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు లలితమ్మ, రేణు వర్మ, నాయకులు ఉపేంద్ర కుమార్, మధుసూదన్ శర్మ, ప్రశాంత్ కుమార్, వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
News
ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష తాత్కాలిక విరామం
కర్నూలు జిల్లా అదోనిలో గత 269 రోజులుగా ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు తాత్కాలికంగా విరామం లభించింది. ఆదోని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కే. మీనాక్షి నాయుడు విజ్ఞప్తి మేరకు జేఏసీ నాయకులు దీక్షా శిబిరాన్ని విరమించి వేదికను తొలగించారు.
దీక్ష విరమణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ — రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక అంశాల దృష్ట్యా తక్షణమే కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు ఆమోదం పొందిన వెంటనే, కొత్త నియోజకవర్గాలు మరియు జిల్లాల సంఖ్య పెరుగుతుందని ఆ సమయంలో ఆదోనిని జిల్లాగా ప్రకటించే అంశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని లోకేష్ మరియు ఇన్‌చార్జ్ మంత్రి హామీ ఇచ్చారని మీనాక్షి నాయుడు వెల్లడించారు.
జేఏసీ ప్రతినిధులు వై.పి. నాగరాజ్, సుజ్ఞానమ్మ, దేవశెట్టి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ — గత 269 రోజులుగా పశ్చిమ కర్నూలు ప్రాంత ప్రజల కాంక్ష మేరకు సాగిన ఈ ఉద్యమానికి ఆదోనితో పాటు ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జేఏసీ నాయకులు గుర్తుచేశారు. కుల, మత, రాజకీయ పార్టీల అతీతంగా వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, పత్రికా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాలు ఈ దీక్షలకు పూర్తి మద్దతు తెలిపారుఅని ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కాదని 77 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పశ్చిమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, మెరుగైన వైద్యం, తాగు/సాగు నీటి లభ్యత కోసమే ఈ పోరాటం ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా 269 రోజుల పాటు ఉద్యమానికి సహకరించిన ప్రజలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ప్రతినిధులకు జేఏసీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News3 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News4 weeks ago
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
-
News2 weeks ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..
-
News3 weeks ago
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
-
News3 weeks ago
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
-
News3 weeks ago
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
-
News4 days ago
ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం