News
హెచ్చరికలు జారీ చేసిన తుంగభద్రా డ్యాం అధికారులు
తుంగభద్రా డ్యాం: నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి ప్రవాహంకు తుంగభద్ర ప్రాజెక్ట్ 19 గేట్ కొట్టుకుపోవడం ద్వారా ఉదయం 7 గంటలకు 1లక్ష 50 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్టు తుంగభద్ర డ్యాం అధికారులు ప్రకటించారు. నది తీర ప్రాంతాలకు భారీగా నీరు వస్తున్నందునా అధికారులు ముందస్తుగా గ్రామంలోని ప్రజలను నది తీర ప్రాంతాలకు పోనివ్వకుండగా, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేసి ముందస్తుగా గజాయితగాలను ఏర్పాటు చేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

◆ నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండండి..
◆ అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండండి..
◆ గ్రామ ప్రజలు నదితీరా ప్రాంతాల్లోకి వెళ్లకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయండి.
◆ ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
◆ నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. ఆదివారం డివిజన్లోని కౌతాళం మండలం మేలగనూరు మరియు కుంబలనూర్ , నది తీర ప్రాంతాలను పరిశీలించి తనిఖీ చేశారు. ఆదోని డివిజన్లో తీర ప్రాంతంలో ఉన్న కౌతళం, కోసిగి, నందవరం మండలలో నది తీర ప్రాంతాలకు భారీగా నీరు వస్తున్నందున అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు.
ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తీరప్రాంతంలో సంబంధిత మండల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వోలు, వీఆర్ఏలు, ఇరిగేషన్, గజఈతగాళ్లు, అప్రమత్తంగా ఉండాలన్నారు. లైఫ్ జాకెట్లు, SDRF బృందాలను ఏర్పాటు చేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే ఆదోని డివిజన్లో రెండు టీం రాష్ట్ర విపత్తు రెస్క్యూ టీమ్స్ సిద్ధంగా ఉండగా వారికి పలు సూచనలు సబ్ కలెక్టర్ చేశారు.

News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
