Connect with us

News

ఆదోని అభివృద్ధికి సహకరించండి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గురువారం తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అధినేత చంద్రబాబు నాయుడుకి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆదోని అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

News

పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Published

on

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం గవి గట్టు గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో నీలకంఠ, బంగారయ్య ఇద్దరికీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీలకంఠ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పొలం విషయంలో పక్కన పొలంలో ఉన్న ఐదు మంది వ్యక్తులు ఇద్దరు మహిళలతో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీలకంఠ, బంగారప్ప
Continue Reading

News

సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్

Published

on

కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు కేరాఫ్ గా నిలిచాడని టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.

టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్

కర్నూలు జిల్లా ఆదోనిలో బుదవారం గడ్డా ఫక్రుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను అమలు చేస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటింటా సుపరిపాలన పేరిట గడప గడప కు తిరిగి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. మంత్రి వర్గంలో  తీసుకున్న 9 అంశాలలో బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ వాయువు పీల్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అమలు,సత్ప్రవర్తన కలిగి ఉండడంతో 17 మంది జీవిత ఖైదీలకు విముక్తి, రాష్ట్ర వ్యాప్తంగా 2048 ఎస్పీఎఫ్ పోలీసు లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి, ఆటో డ్రైవర్ల తో సమావేశం ఏర్పాటు లాంటి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకున్న పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

Continue Reading

News

కాలేజ్ ప్రాంగణంలో నెట్‌వర్క్ టవర్‌ను తొలగించాలి విద్యార్థి సంఘాల డిమాండ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ టవర్‌ను వెంటనే తొలగించాలి DSF, PDSO, RPSF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ RPSF జిల్లా అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలేజ్ మైదానంలో టవర్ ఉండటం వల్ల విద్యా వాతావరణం ప్రభావితం అవుతోందని వారు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ చొరవ చూపి  వెంటనే స్పందించి తక్షణమే టవర్‌ను తొలగించాలని కోరారు. టవర్ ను తొలగించ లేకపోతే విద్యార్థులు అందరినీ సమీకరించి రానున్న రోజుల్లో బందుకు పిలుపునిస్తామని విద్యార్థి సంఘాలుగా ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్  కు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు షకీల్ వినీల్ రాజ్ కుమార్ నవీన్ వినోద్ మురళి తదితరులు పాల్గొనడం జరిగింది

ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలు
Continue Reading

Trending