Connect with us

News

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు

Published

on

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు
■ కల్తీ దందాపై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల ఉక్కు పాదం..
■ అల్లం పేస్ట్ కల్తీ ముఠా అరెస్ట్..
■ బిర్యాని చికెన్ కర్రీలో రుచి కోసం కలిపే అల్లం పేస్ట్ కల్తీ కి పాల్పడుతున్నారు దుండగులు.

అల్లం వెల్లుల్లి కల్తీ పేస్ట్ ను తయారు చేస్తున్న పరిశ్రమ
అల్లం వెల్లుల్లి కల్తీ పేస్ట్ ను తయారు చేస్తున్న పరిశ్రమ

హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో అక్రమంగా కలిసి దందా నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి సుమారు 500 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మరియు 200 లీటర్ల అసిటిక్ యాసిడ్ 550 కేజీల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్లును సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి ప్రమాదకరమైన కెమికల్స్ మరియు అపరిశుభ్ర వాతావరణంలో మురుగు నీటితో పేస్ట్ తయారు చేస్తున్నరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమతులు లేకుండా పరిశ్రమ నిర్వహిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదకరమైన కెమికల్స్ ని కూడా కలుపుతున్నట్లు గుర్తించారు ఎస్ ఓ టి పోలీసులు. 2 సంవత్సరాలుగా ఈ దందా నిర్వహిస్తున్నరు. ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్నరు నిర్వాహకులు. ఇద్దరు నిర్వాహకుల్ని అరెస్టు చేసిన విచారణ చేపట్టా అధికారులు. ఇటువంటి కల్తీ పేస్టులను తయారు చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి మరియు ప్రమాదకరమైన కెమికల్స్
కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి మరియు ప్రమాదకరమైన కెమికల్స్
ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్న నిర్వాహకులు
ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్న నిర్వాహకులు

News

జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు  చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన
Continue Reading

News

BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు

Published

on

ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Continue Reading

News

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 13.07.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 13 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1602.0 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 24.355 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 17152 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 16807 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 652 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1625.23 అడుగులుగా ఉండగా.. 77524 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 38071 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

Trending