Connect with us

News

ఆదోని పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి …

Published

on

వేసవి సెలవుల కారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు, టూర్లకు వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎటువంటి విలువైన వెండి గాని బంగారు గాని డబ్బులు గానీ ఇతర విలువైన పత్రాలను కానీ పెట్టి వెళ్ళకండి. దయచేసి వాటిని బ్యాంకు లాకరులో భద్రపరుచుకోండి లేదా మీకు నమ్మకమైన వ్యక్తుల వద్ద ఉంచి వెళ్ళండి.
మీరు అలా ఊరికి వెళుతున్నప్పుడు లోకల్ పోలీస్ వారికి మీ యొక్క సమాచారాన్ని అందించండి. అక్కడ పోలీసువారినిఘా పెట్టడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారికి సహకరించండి. మీ యొక్క కష్టార్జితాన్ని దొంగల పాలు కాకుండా కాపాడండి. పట్టణంలో దొంగతనాలు జరగకుండా పోలీసు వారితో కలిసి భాగస్వామ్యం కండి అని పిలుపునిచ్చారు ఆదోని 1 టౌన్ సిఐ విక్రమ సింహ.

News

ఉరుకుంద కుంభాభిషేక మహోత్సవం ఏర్పాట్ల పరిశీలన

Published

on

కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఊరుకుంద గ్రామంలో  శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన పరిపాలన కార్యాలయంలో ఫిబ్రవరి మాసంలో జరిగే కుంభాభిషేక మహోత్సవం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆదోని శుక్ర మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించరు. అనంతరం గ్రామంలో పార్కింగ్ స్థల ప్రాంతాలను పరిశీలించి అధికారులతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి ఉపేంద్ర, ఈవో విజయరాజు, తహశీల్దారు రజినీకాంత్ రెడ్డి, డి.ఎల్.పి.వో నూర్జహాన్, ఆర్ అండ్ బి డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కుంభాభిషేక మహోత్సవం ఏర్పాట్లపై మాట్లాడుతున్న సబ్ కలెక్టర్
సబ్ కలెక్టర్ సమావేశంలో పాల్గొన్న దేవస్థానం అధికారులు
దేవస్థానం అధికారులతో మాట్లాడుతున్న సబ్ కలెక్టర్
Continue Reading

News

బాలుర వసతి గృహా ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

Published

on

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన చింతకుంట గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్  క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం రీ సర్వే సంబంధించిన అంశాలపై గ్రామ సచివాలయం నందు అధికారులతో చర్చించరు.
అనంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కోసిగి మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహా పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రుద్ర గౌడ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, సీనియర్ సహాయకులు తిక్కస్వామి,మండల సర్వేయర్ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రీ సర్వే పైలెట్ ప్రాజెక్టును పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్
ఇది సర్వే పైలెట్ ప్రొజెక్టర్ అధికారులతో మాట్లాడుతున్న సబ్ కలెక్టర్
బాలుర వసతి గృహంలో తనిఖీలు నిర్వహిస్తున్న సబ్ కలెక్టర్
Continue Reading

News

ఐరానగల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కొరకు పరిశీలన

Published

on

కర్నూలు జిల్లా కోసిగి మండలం ఐరానగల్  గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు స్థల సేకరణ నిమిత్తం స్థల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించరు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రుద్ర గౌడ్, రైల్వే ఇంజనీర్ ఉమాపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

స్థల పరిశీలన చేస్తున్న సబ్ కలెక్టర్
Continue Reading

Trending