News
పేదల రక్తం తాగుతున్నా ప్రైవేట్ ఆస్పత్రులపై ఒక తల్లి ఆవేదన

◆ వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నా ప్రైవేటు ఆసుపత్రులు..
◆ సేవ పేరుతో వడ్డీ వ్యాపారులు వైద్య రంగంలో పెట్టుబడులు..
◆ కొత్త కొత్త పేర్లతో రోగులను పీల్చి పిప్పి..
◆ ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే ఆగమే..
◆ కాస్త క్రిటికల్ అని తెలియగానే హైదరాబాద్ కు రిఫర్..
◆ అక్కడి ఆసుపత్రులతో కమీషన్లు..
◆ నలుగురు డాక్టర్ల పేర్లు బోర్డులో రాసి, రండి రండి అని ప్రచారం..
◆ నిలువు దోపిడీకి అడ్డాలు.. తరతరాలకు తరగని ఆస్తులు..
కర్నూలు జిలా ఆదోని లో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుటుకొస్తునాయి. ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి రావడం మంచి పరిణామమే… ఏ రంగంలో నైనా కాంపిటీషన్‌తో ధరలు తగ్గుతాయి. ఒక్క వైద్య రంగంలో మాత్రమే కొత్త ఆసుపత్రులు రావడంతో మరింత ధరలు పెరుగుతుంటాయి. వైద్య విధానంలో చికిత్సకు మాత్రం భలే డిమాండ్ పెరుగుతోంది. ఆదోని పెద్దఎత్తున ఆసుపత్రులు వెలుస్తున్నాయి. వైద్యం ముసుగులో వ్యాపారం మిలితమై వుంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసేందుకు, కొంత కాలం పాటు శిక్షణా కాలం ముగిసిన తర్వాత పల్లెల్లో వైద్యం చేయమంటే మాత్రం ససేమిరా? అంటారు. కాని ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేయడానికి వైద్యులు ముందుంటారు. ప్రజల సొమ్ముతో చదివిన వాళ్లుకూడా పేదలకు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక లక్షలు పెట్టి సీట్లుకొని చదువుకున్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మందులతో తక్కువ కాదు అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీలు చేస్తూ వుండేవారు. కాని కాలం మారింది. డాక్టర్ల తీరు కూడా మారింది. వైద్య విద్య పూర్తయిన వెంటనే ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అని నామకరణంతో ఆసుపత్రులు ఏర్పాటుచేస్తున్నారు. స్ధానిక నాయకులతోపాటు, జిల్లా స్దాయి నాయకులతో రిబ్బన్ కట్ చేయించారంటే చాలు పబ్లిసిటీ కూడా వస్తుంది. ఇక కార్పోరేట్ వైద్యం అంటూ మొదలుపెడుతున్నారు.
కొంత మంది డాక్టర్లు కలిసి సూపర్ స్పెషాలిటీ, మల్లీ సూపర్ స్పెషాలిటీ అంటూ అందమైన బోర్డులు ఏర్పాటు చేస్తారు. చౌరస్తాలలో పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిసిటీ కూడా బాగానే ఇస్తారు. ఇక ఓపి ఫీజులు కూడా తక్కువేం వుండవు. ఒక్కసారి డాక్టర్ చేతికి మన చేయి వెళ్లిందంటే చాలు, ఎన్ని రకాల వైద్య పరీక్షలు రాస్తారో అన్నది ఆ సమయానికి వారు వున్న మానసిక పరిస్దితి మీద కూడా ఆధారపడి వుంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు. ఇంతా జరిగాక, ఇక్కడ అన్ని సదుపాయాలు లేవు. స్పెషలిస్టులు లేరు కర్నూలు, హైదరాబాద్‌కు రాస్తున్నామంటూ చేతులు దులుపుకుంటారు. తాంబూలాలిచ్చామని వదిలేస్తారు. ఇక వైద్యం వంతు హైదరాబాద్‌కు …. అక్కడ ఆసుపత్రిలో చేరగానే వైద్యం మొదలు కాదు. మళ్లీ టెస్టులు. ఒకరోజు ముందు రిఫర్ చేసిన ఆసుపత్రి టెస్టులైనా సరే. కర్నూలు, హైదారాబాద్ లో మళ్లీ చేయాల్సిందే… పంపిన ఆసుపత్రికి వాటాలు పంపాల్సిందే… ఇలా అందినకాడికి దోచుకోవడం మాత్రం ఆసుపత్రులకు బాగా అలవాటైపోయింది.
వైద్యం శూన్యం అన్నట్లు ఆదోని నుంచి నిత్యం ఆంబులెన్సులు కర్నూలు, హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులకు పోతూంటాయి. మరి ఆదోనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులని ఏర్పాటు చేసిన వాటిలో అందరూ స్పెషలిస్టులే అంటారు. అన్ని రకాల వైద్య పరికరాలు, వైద్యులు అందుబాటులో అంటూ ప్రకటిస్తారు. ఎంతో నైపుణ్యం వున్న వైద్యులు అంటారు. కాని ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఒక రోజు వైద్యం చేయడం రెండో రోజు కర్నూలు, హైదరాబాద్ పంపేయడం ఇది బాగా అలవాటుగా మారింది. కొన్ని జబ్బులకు చికిత్సలో ముంచుకొచ్చేదాకా చూడడం, కర్నూలు, హైదరాబాద్‌కు పంపడం ఒక వ్యాపారంగా మారిపోయింది. అక్కడ లక్షల మాట తప్ప, వేల మాట అసలే మాట్లాడే పరిస్దితి వుండదు.
వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ ఆసుపత్రులు నరకానికి నకళ్లుగా మారాయంటున్నారు. ఇలా ఏర్పాటైన ఆసుపత్రుల్లో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. ప్రాణాలు కూడా పోతున్నాయి. కాని అవి వెలుగులోకి రావడంలేదు. అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం ఆ ఆసుపత్రులు ఎవరి పేరు మీద పర్మిషన్లు ఇస్తున్నారోకూడా తెలియడం లేదు. కాని ఆ ఆసుపత్రుల మీద చర్య తీసుకున్నవారు లేదు. కొత్త ఆసుపత్రులకు పర్మిషన్లు ఆగడం లేదు. ప్రజల జీవితాలతో ఆటలాడుకోకుండా వుండడం లేదు. వైద్యో నారాయణ హరిః కాస్త…హరీ! అనే దాకా వస్తున్నాయి. ప్రజల జీవితాలు చాలా చిన్నవైపోతున్నాయి.
News
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.. ఆదోని సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణంలో నిమజ్జనం వెళ్లే ప్రధాన దారి అయినా , తిక్క స్వామికి దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, ఫరిసా మోహల్ల, శ్రీనివాస్ భవన్, గణేష్ సర్కిల్, న్యూ ఫ్లైవర్, వినాయక ఘాట్ ప్రధాన దారులను తనిఖీ చేసి పరిశీలించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… నిమజ్జనం కు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో నిమజ్జన ఏర్పాట్లకు చేయాలని పోలీసులను విగ్రహాలు వెళ్లే దారిలో రోడ్లో ఉండే ప్యాచ్ వర్క్ ను తర్వాత గతిన పూర్తి చేయాలని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు, విగ్రహాల ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు ను అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఊరేగింపు జరిగే వీధుల్లో రోడ్డు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇసుక, కంకర అడ్డు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు. నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పకడ్బందీ నియంత్రణ చేపట్టాలని పోలీసులకు సూచించారు. కెనాల్ దగ్గర గజ ఈతగాలను ఏర్పాటు చేయాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులను, మెడికల్ క్యాంప్ ఏఆర్పాటు చేయాలని వైద్యాధికారులకు, నిమజ్జనం సమయంలో క్రేన్లు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పి హేమలత, తాసిల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మనాభ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News
కుక్క దాడి 10 మందికి గాయాలు

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో పిచ్చికుక్క గ్రామస్తులపై దాడి చేయడంతో 10 మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరికీ మస్తాన్ సాబ్ (68), గౌతమ్ (8) కు తీవ్ర గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 8 మందిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధ్యులు తెలిపారు.

News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 28-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 19617 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 19412 క్యూసెక్కులు
-
News4 weeks ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News1 day ago
పాము కాటుకు మహిళ మృతి
-
News3 weeks ago
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్
-
News3 weeks ago
ఆటో డ్రైవర్స్ లకు అవగాహన
-
News11 hours ago
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.. ఆదోని సబ్ కలెక్టర్
-
News11 hours ago
కుక్క దాడి 10 మందికి గాయాలు
-
News3 weeks ago
వికలాంగుల పెన్షన్ దారుల ఆవేదన