Connect with us

News

కొత్త క్రిమినల్ చట్టాలను అమల్లోకి తెచ్చిన మోడీ సర్కార్

Published

on

కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి వ్యత్యాసాలు ఉండడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కేసులతో దొంగలు దొరలుగా – దొరలు దొంగలుగా చలామణి అవుతున్నారు. మనదేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అనే ఆలోచన సన్నగిల్లుతుంది. బతికుండగా తుది తీర్పు వస్తే చాలు అని ఎదురుచూసే పరిస్థితి సామాన్యులది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన తర్వాత కోర్టులో తీర్పు కోసం రోజులు ఎదురు చూడకుండా సత్వరంగా తీర్పు రావాలని సామాన్యు ప్రజలు ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్..


టీవీ9 బర్నింగ్ టాపిక్ లో తెలిపిన వివరాలు..

భారతదేశంలో ఇప్పుడు వరకు ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్ల 10 లక్షలు ఇందులో 30 ఏళ్లకు పైగా ములుగుతున్న కేసులు 1 లక్ష 80 వేలు నేరస్తులుగా రుజువు కాక జైల్లోనే మగ్గుతున్న రిమైండ్ ఖైదీల సంఖ్య 4 లక్షలు 50 వేలు.. వీరి కోసం సపరేట్గా కొత్త జైలు నిర్మించాలి అనే పరిస్థితి..

అందుకే ఈ మార్పు తెస్తున్నామని మోడీ ప్రభుత్వం సగర్వంగా ప్రకటించుకుంది.

అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు..

150ఏళ్ల తర్వాత మారిన బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు

  1. 1. ఇండియన్ పీనల్ కోడ్-IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత-BNS.
  2. 2. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌-CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-BNSS.
  3. 3. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌-IEA స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం-BSA చట్టాలు
    భారతీయ న్యాయ సంహిత చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం.
  • ఎవరైన అరెస్టయితే 14రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్..
  • 40రోజులల్లో తీర్పు, 60 రోజుల్లో అభియోగాలు నమోదు.. ఏడేళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్ ..
  • ఫోరెన్సిక్‌ నిపుణులచే ఆధారాలు సేకరించాలి
    3 నుంచి 7ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు
    24 గంటల్లోనే FIR నమోదు చేయాలి..
  • 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి.
    అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి..
  • ఆ బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లోనే సిద్ధం చేయాలి..
  • పిల్లలను కొనడం, అమ్మడాన్ని కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం..
  • మైనర్‌పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష..
  • చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం..
  • మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలి..
  • బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి..
  • మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాలి..
  • అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా కేసు..
  • పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చు..
  • క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్‌ సిస్టం CCTNS..
  • దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లు అనుసంధానం..
  • డిజి లాకర్‌ను ఇంటర్ ఆపరబుల్‌ క్రిమినల్ జస్టిస్ సిస్టం ICJSకు అనుసంధానం..
  • ఆధారాలు ఎవరూ కూడా మాయం చేయలేని వ్యవస్థ రూపకల్పన..
  • అనుమానాస్పద వస్తువులు జప్తు చేసినప్పుడు 48గంటల్లో కోర్టులో సమర్పించాలి..
  • బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు..
  • ఫిర్యాదుపై పోలీసులు 3రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాల సేకరణ..
  • మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, దివ్యాంగులు,15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు తాము ఉండే చోటే పోలీసుల సాయం..
  • దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు SMS ద్వారా జారీ..
  • గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం..
  • బాధితులకు, నిందుతులకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఫ్రీ
  • పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్‌, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల 2వారాల్లో పొందే ఛాన్స్..

News

బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష

Published

on

కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

డ్రైవర్లను కోర్టు నుంచి జైలుకు తీసుకు వెళ్తున్న పోలీసులు
Continue Reading

News

పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.

Continue Reading

News

ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న  ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.

ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప  బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.

ప్రమాదానికి గురైన కారు
ప్రమాదానికి గురైన కారు
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో  చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
పరిశీలిస్తున్న పోలీసులు
Continue Reading

Trending