News
AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏలు విడుదల

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏలను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది..
G.O. Ms. No 66 ద్వారా ఉద్యోగులకు డీఏ.. G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73% మంజూరు చేసింది. ఈ కొత్త డీఏను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ప్రభుత్వం అందజేయనుంది.
కాగా జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను.. సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. ఈ కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల మొత్తం డీఏ 22.75 శాతం కానుంది. డీఏ మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు..
News
ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు. ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే భోజనం చేశారు.

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


-
News4 weeks ago
హెచ్ పి గ్యాస్ సిలిండర్లు సీజ్
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర