News
కర్నూల్ లో ఏసిబి సోదాలు భారీగా నగదు ఆస్తులు స్వాధీనం
కర్నూలు నగరంలో డిజిపి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు కర్నూలు జిల్లా డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాతకు చెందిన ఇల్లు, కార్యాలయం తోపాటు కర్నూలు నగరం లోని ఐదు ప్రాంతలలోని ఆమె బంధువుల ఇళ్ళలో అవినీతి నిరోధక శాఖ(ఏసిబి) కర్నూలు విభాగం అధికారుల బృందం ఉదయం నుండి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత నుండి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు:
• కర్నూలు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక G+2 ఇల్లు,
• కర్నూలు టౌన్ అశోక్ నగర్ కాలనీలో ఒక G+1 ఇల్లు,
• కస్తూరి నగర్ కాలనీ, కర్నూలు టౌన్ లో ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో G+1 దుకాణంతో కూడిన ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో మరో దుకాణం
• కర్నూలు మండలం సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి.
• కర్నూలు పట్టణం శివారు ప్రాంతంలో రూ.23,16,000/- విలువ చేసే ఎనిమిది ఇళ్ల స్థలాలు
• 40 తులాల బంగారం
• ఒక ఫోర్ వీలర్ (టాటా విస్టా) కారు, ఒకటి 2 వీలర్.
• ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, బంగారం మరియు గృహోపకరణాలు
• రూ. 8,21,000/- నగదు
అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత ఇంట్లో ఇంకా ఏసిబి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
అవినీతి అధికారులపై ప్రజలు ఫిర్యాదు కోసం 14400 అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించవచ్చని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
కర్నూల్ లో ఏసిబి సోదాలు చేస్తున్న వీడియో
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్
కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


