అక్రమ మద్యం తరలింపుపై సెబ్ అధికారుల దాడులు

కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఆదేశాలతో ఎన్ఫోరసెమెంట్ సూపరింటెండెంట్ ఎస్. రవికుమార్ పర్యవేక్షణ లో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై ఆదోని సెబ్ పోలీసులు, డిటీఎఫ్ కర్నూల్ సిబ్బంది కలసి గురువారం దాడులు నిర్వహించారు.
కర్నూలు జిల్లా కౌతాళం మండలం రౌడురు గ్రామం సమీపంలో మూకన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతనివద్ద నుండి 4బాక్స్ లు (90 ml 384 టెట్రా ప్యాకెట్లు), ఒక స్కూటర్ సీజ్ చేశారు సెబ్ పోలీసులు. ఈ దాడులలో సిఐ విన్నీ లత, డిటీఎఫ్ సిఐ నరస నాయుడు ఎస్ఐ ఇస్మాయిల్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top