సేవా కార్యక్రమాలలో ముందుంటా ఆదోని రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడు సందీప్ రెడ్డి

విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తాం, ఉచితంగా కంటి ఆపరేషన్లు, దివ్యాంగులకు సైకిల్ ట్రైలు, విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో వసతులు, కాలుష్య నివారణ కోసం చెట్లు నాటడం లాంటి ఎన్నో సేవలను ముందుండి చేస్తామని ఆదోని రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడు సందీప్ రెడ్డి హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఆదివారం రోటరీ క్లబ్ సమావేశం రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం కె రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ గవర్నర్ దశరథ రామిరెడ్డి, ఖాజీ అల్తాఫ్ హుస్సేన్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి దేశంలో శాంతి నెలకొనాలని నిమిషం పాటు మౌనం పాటించారు. రోటరీ క్లబ్ ఆదోని నూతన అధ్యక్షునిగా సందీప్ రెడ్డి కార్యదర్శిగా డాక్టర్ సైఫుల్ల ట్రెజరర్ గా వికాస్ బండారితో పాటు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు జోనల్ స్థాయి క్రీడా పోటీలు, ఉచితంగా కంటి ఆపరేషన్లు, దివ్యాంగులకు సైకిల్ ట్రైలు, విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో వసతులు, చెట్లు నాటడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.

రోటరీ క్లబ్ గవర్నర్ కు షీల్డ్ అందిస్తున్న ఫోటో

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు భరత్ షా , విట్టా మురళీ, జీవన్ సింగ్, ప్రశాంత్ గాంధీ, సునీల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాచోటీ సుబ్బయ్య, ఉమేష్ పాయి, వినోద్ జైన్, పద్మనబయ్య శెట్టి, శేషయ్య సోమశేఖర్ రెడ్డి, అమిత్ గాంధీ, ఇతేష్, విట్ట రాజేష్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top