ఆదోని పట్టణంలో భీమ్ రెడ్డి కాలనీలో వీధిలైట్లు వేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న మాట్లాడుతూ భీమ్ రెడ్డి కాలనీ నందు వీధిలైట్లు వేయాలని కాలనీవాసులు సంబంధిత అధికారులకు తెలిపిన చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్లు చందంగా ఉందని అన్నారు. కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంబందిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు తెలిపారు. కాలనీ నందు వీధిలైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళలో ప్రజలు చిన్నపిల్లలు బయటకు రాని పరిస్థితి ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ముళ్ళపోదలు ఎక్కువగా ఉన్నాయని విష పురుగులు కరిచే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు. కాలనీలో విద్యుత్ స్తంభాలు కేవలం అలంకారప్రాయంగా ఉన్నాయి తప్ప వాటికి వీధిలైట్లు లేవని వారు తెలిపారు. ఇప్పటికైనా సంబంధం అధికారులు వెంటనే స్పందించి భీమ్ రెడ్డి కాలనీలో వీధిలైట్లు వెయ్యాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పాన్న, ముక్కన్న, పట్టణ నాయకులు కృష్ణమూర్తి, నాగరాజు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.