ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 04-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర ₹. 5211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6091/- రూపాయలు కనిష్ట ధర ₹. 3691/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5718/- రూపాయలు కనిష్ట ధర ₹.5280/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5376/- రూపాయలు కనిష్ట ధర ₹.4611/- రూపాయలు … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 04 02 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 84200-001 గ్రాములు సుమారు రూ. 8420-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 77970-001 గ్రాములు సుమారు రూ. 7797-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 947-00

రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ హోళగుంద మండలం రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన పెద్ద హ్యట గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పరిశీలించిన అనంతరం రీ సర్వే సంబంధించిన అంశాలపై చిన్న హ్యట గ్రామ సచివాలయంలో అధికారులతో చర్చించరు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిజాముద్దీన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, మండల సర్వేయర్ (ఇన్చార్జి) శ్రీనివాసులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

బ్రిడ్జి పైనుంచి కింద పడి వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ఆదోని మాసా మసీద్ కాలనీకి చెందిన సయ్యద్ నూర్ (55) కొత్త ఓవర్ బ్రిడ్జి పై నుండి ప్రమాద వశాత్తు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గుర్తించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది క్షతగాత్రుడు అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ప్రాంగణంలో రోదనలు మిన్నంటకున్నాయి, వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. తోపుడు బండి పై కూరగాయల వ్యాపారం … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 03-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7365/- రూపాయలు కనిష్ట ధర ₹. 4099/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6089/- రూపాయలు కనిష్ట ధర ₹. 3279/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5722/- రూపాయలు కనిష్ట ధర ₹.4000/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు … Read more

ఖాళీ బిందెలు కొళాయి ముందు పెట్టి నిరసన

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలు కొళాయి ముందు పెట్టి  గ్రామస్తులతో కలిసి సిపిఎం నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ … Read more

నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న బాలికల హాస్టల్ విద్యార్థినిలు

కర్నూలు జిల్లా  ఆదోని పట్టణంలో బాలికల హాస్టల్ లో విద్యార్థినీలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ బయటి నుంచి నీళ్లు తెచ్చుకునె పరిస్థితి ఏర్పడిందని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఎమ్మిగనూరు సర్కిల్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎస్.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్, నవీన్ మాట్లాడుతూ మొద్దు నిద్రలో ప్రభుత్వ విద్యా అధికారులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోని పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉంది విద్యార్థులు బయటకు వెళ్లి నీళ్లు … Read more

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ సీజ్

కర్నూలు జిల్లా ఆదోని మండలం డణపురం గ్రామం మేక వంక సమీపంలో గురువారం రాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తూ పిడిఎస్ రైస్ తరలిస్తున్న లారీని సీజ్ చేశారు. డ్రైవర్ నాగరాజు క్లీనర్ మల్లికార్జున ను పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి కర్ణాటక రాష్ట్రం రాయచూరు పట్టణానికి ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు ఎస్సై నాగేంద్ర … Read more

రోడ్ సేఫ్టీ పై వినూత్న రీతిలో విద్యార్థుల ప్రదర్శన

కర్నూలు జిల్లా ఆదోని లో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు-2025 లో భాగంగా పోలీసు అధికారులు  బీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులతో వినూత్న రీతిలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణలో ప్లే కార్డ్స్ ద్వారా  ట్రాఫిక్ రూల్స్ ని చూపిస్తూ ప్రజలకు ట్రాఫిక్ గురించి అవగాహన కలిగిస్తూ  టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి భీమా సర్కిల్, శ్రీనివాస భవన్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అక్షర శ్రీ జూనియర్ కాలేజీ లో జాతీయ … Read more

కూటమి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ డీలర్ షాప్ లకై పరీక్ష పోటీలలో ఎంపికైన వారికే రేషన్ డీలర్ షాపులు కేటాయించాలి ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్  ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కూటమి నాయకులు రేషన్ డీలర్ షాపుల కోసం మాకిన్ని కావాలి మాకు ఇన్ని కావాలని గొడవ పడడం సరైన పద్ధతి కాదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా పరీక్ష రాసి ఎంపికైన వారికే కేటాయించాలని డిమాండ్ … Read more