బిసి గర్ల్స్ హాస్టల్లో బాలికను విషపురుగు కరిచి పరిస్థితి విషమం

కర్నూలు జిల్లా ఆదోని BC గర్ల్స్ హాస్టల్ లో కల్పన అనే బాలిక ను విషపురుగు కరిచిన పరిస్థితి విషమంగా మారడంతో అర్ధరాత్రి ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ICU లో చికిత్స చేస్తున్నారని ఇప్పటి వరకు ఏమైందో చెప్పడం లేదని ఇంత గోప్యంగా చికిత్స చేయవలసిన అవసరం ఎందుకని తల్లి లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తుంది. జాయింట్ డైరెక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి, జిల్లా BC వెల్ఫేర్ […]

తుంగభద్ర ఎల్.ఎల్.సి కాలువకు జలహారతి

కర్నూలు జిల్లా అదోనిలో తుంగభద్ర ఎల్.ఎల్.సి (లోలెవెల్ కెనాల్) కాలువకు నీళ్లు రావడంతో జలహారతి నిర్వహించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. మున్సిపల్ చైర్ పర్సన్ శాంత పూజలు నిర్వహించి పట్టుచీరను సమర్పించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తిగా నిండిపోతుందని ఇప్పటినుండి ఆదోని పట్టణ ప్రజలకు నీటి సమస్య ఉండదని అయితే కొత్తనీరు వస్తున్నందుకు […]

వైద్య విధానాల గురించి ప్రజలకు అవగాహన..

ఆదోని పట్టణంలోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విభాగం వైస్ ప్రెసిడెంట్ వైద్య విధానాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం పట్టణానికి రావడం జరిగిందనిదని వారన్నారు..మెడికల్ కాలేజ్ ప్రారంభమైతే.. ఆరోగ్యశ్రీ కోసం కర్నూల్ కు వెళ్లనవసరం లేదు అన్ని ఇక్కడే అందుబాటులో ఉంటుందన్నారు..

కర్ణాటక మద్యంపై పోలీసుల ఉక్కుపాదం

కర్నూలు జిల్లా అదోని మండలం పెద్ద తుంబలం గ్రామములోని కంబయ్య కట్ట వద్ద అక్రమంగా కర్ణాటక మధ్యన తరలిస్తున్న గవిగట్టు గ్రామంనికి చెందిన ఉప్పర మహాదేవప్ప అనే వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ పై 2 బాక్సులు 182 (90ml) టెట్రా ప్యాకెట్ లను నీ తీసుకొని వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి టెట్రా ప్యాకెట్ మరియు టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ సీజ్ చేసి రిమాండ్కి తరలించారు.

భార్యను చంపిన భర్త

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కిల్చినపెట్ లో దారుణం చోటుచేసుకుంది. భర్త చంటి భార్య శిరీష (22) గొంతు నులిమి హత్య చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగి పోయాడు. అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో హత్య చేసినట్లు భర్త చంటి పోలీసులకు తెలిపాడు. 1 టౌన్ పోలీసులు హత్యపై పూర్తి వివరాలు సేకరిస్తున్నరు.

ఇంటి పట్టాల పంపిణీ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఇందిరా నగర్, బండేమెట్ట వార్డు ప్రజలకు 135 ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో 2100 రూపాయలు కట్టి ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కల నెరవేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చలపతి కౌన్సిలర్ చిన్న మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిమ్మప్ప పాల్గొన్నారు.

మహమ్మద్ అలీ పార్కులో షాదీ ఖానా పనులు పునః ప్రారంభం

కర్నూలు జిల్లా అదోనిలో మహమ్మద్ అలీ పార్కులో ముస్లిం మైనారిటీ షాదీఖానా పనులకు 20 లక్షల చెక్కును ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతికి డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సభియా బేగం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిలిచిన నిలిచిపోయిన పనులకు పునః ప్రారంభించడానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారని తెలిపారు. ఇంకా రావాల్సిన కోటి రూపాయలు త్వరలో వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలోఏపీ స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ […]

కర్ణాటక మధ్యన తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

కర్నూలు జిల్లా అదోని మండలం సంతకులూరు గ్రామం బస్టాప్ నందు కర్ణాటక మద్యం తరలిస్తున్న ఆదోని కి చెందిన ఇద్దరు వ్యక్తులు దివాకరు, పరమానందప్ప లను పట్టుకొని వారి వద్ద నుండి కర్ణాటక చెందిన 14 ప్యాకెట్స్ 180 ml, 8 టెట్రా packets 90ml ఒరిజినల్ ఛాయిస్ మరియు ఒక మోటార్ సైకిలను ఇస్వి పోలీసులు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం బసాపురం ఎస్ ఎస్ బ్యాంక్ సమీపంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జయ మనోజ్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జయ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ 5 ఎకరాల్లో సుమారు 800 మొక్కలను నాటినట్లు తెలిపారు. ఎన్ఆర్జిఎస్ ఫండ్ ఉపాధి హామీ పథకం మరియు సెంట్రల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఫండ్స్ ఇస్తుందని దీని ద్వారా రాష్ట్రమంతా పచ్చ తోరణం గా […]

కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల కేటాయించలి

కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయల కేటాయించాలని కోరుతూ ఆదోని నుండి కర్నూలు వరకు జూలై 26 నుండి 31 వరకు CPM పార్టీ చేపట్టిన మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఆదోని మండలంలో 20 ,21, 22 తేదీల్లో జీపు జాతర ప్రారంభమైంది. గురువారం మాదిరె నుండి ప్రారంభమైం జీపు జాతను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు ప్రారంభించారు. ఈ జీపు జాత మదిరే, చిన్న […]

Back To Top