కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామం సమీపంలో కారులో కర్ణాటక మద్యం తరలిస్తున్న నలుగురురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కర్ణాటక ఓసి డీలక్స్ విస్కీ 40 బాక్సులు, ఒక కారును సెబ్ అధికారులు సీజ్ చేశారు. సెబ్ సిఐ హరికృష్ణ తెలిపిన వివరాల మేరకు ఇస్వి గ్రామానికి చెందిన P. ఉసేన్ సాబ్, పెందేకల్ కి చెందిన M. గోపాల్, కామవారం గ్రామానికి చెందిన హమీద్ మరియు హాల్వి కి చెందిన ఖాసీం అనే నల్గురు వ్యక్తులు కారులో 40 బాక్సులు ఓసి డీలక్స్ విస్కీ కర్ణాటక మద్యం రవాణా చేస్తుండగా పెద్ద పెండేకల్ గ్రామ సమీపంలో గుర్తించి వారినీ అరెస్టు చేసి కారు మద్యం బాక్సులు సీజ్ చేసినట్లు తెలిపారు.
ఈ దాడులలో సెబ్ సిఐ హరికృష్ణ ఎస్ఐలు మధు సుధన రెడ్డి, శివ ప్రసాద్‌లు పిసిలు సోమేశ్, శ్రీనివాస్, రోహిన్, సుధాకర్ పాల్గొన్నారు.