నంద్యాల ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని సెబ్ స్టేషన్ లో 26 వాహనాలకు వేలం పాట నిర్వహించారు అందులో 25 వాహనాలను వేలం పాట పాడారు. వాహనాలకు ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర రూ. 4,24,000/- కాగా వేలం పాటలో రూ.6,29,000/- మరియు GST రూపంలో మరో రూ 1,13,220/- అనగా మొత్తం రూ. 7,42,220/- ఆదాయం వచ్చినది అని సెబ్ అధికారులు తెలిపారు.
ఆదోని మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి మృతి
కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. మునిసిపల్ పర్సన్ శాంత మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు సిబ్బంది కౌన్సిలర్లు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 2011 నుంచి 2014 వరకు మరియు 2019 నుండి 2020 వరకు ఆదోనిలో మున్సిపల్ కమిషనర్ గా కన్యాకుమారి విధులు నిర్వహించారని తెలిపారు. ఆమె చేసిన సేవలను […]
రెండు ద్విచక్ర వాహనాలు డీ
కర్నూలు జిల్లా ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామం ఆస్పరి మెయిన్ రోడ్ బాట మారెమ్మ గుడి సమీపంలో రెండు బైకులు అదుపుతప్పి డీ. బైక్ నడుపుతున్న దిబ్బనకల్ గ్రామానికి చెందినవారు బజారప్ప, శ్రీనప్ప ఇద్దరికి స్వల్ప గాయలు. వెంటనే స్పందించిన స్థానికులు ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మంజూరు 2023-24 అకడమిక్ ఇయర్ కు గ్రీన్ సిగ్నల్
సీఎం జగన్మోహన్ రెడ్డి మాటిస్తే మాట తప్పరు.ఆదోనికి డిగ్రీ కాలేజ్ ఇస్తానని ఇచ్చి హామీ పూర్తి చేశారు.. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా అదోని లో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ 2023-24 అకడమిక్ ఇయర్ కు అనుమతులు మంజూరు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు విద్యార్థి సంఘాలు […]
భారీ మొత్తంలో వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు
■ భారీ మొత్తంలో వెండి స్వాధీనం..■ మచిలీపట్నం చెందిన వ్యక్తి నుండి 26 కేజీల వెండిని స్వాధీనం..■ ఎటువంటి ఆధారాలు రసీదులు చూపీకపోవడంతో ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పజెప్తామన్న సిఐ శ్రీనివాస్ నాయక్ కర్నూలు జిల్లా ఆదోనిలో కొత్త బస్టాండ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మచిలీపట్నం చెందిన వ్యక్తి నుండి వెండి సామాగ్రి, వెండి బిస్కెట్లు టూ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.టూ టౌన్ సీఐ శ్రీనివాస్ నాయక్ ఇచ్చిన వివరాల మేరకు మంగళవారం సాయంత్రం […]
ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి మైనర్ బాలిక కిడ్నాప్
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో గత నెల మే 30వ తేదీ మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిన ముగ్గురిని అరెస్టు చేసిన డీఎస్పీ ముందు హాజరు పరిచారు. డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపిన వివరాల మేరకు మైనర్ బాలికకు బోయ వీరేష్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నా అని మాయమాటలు చెప్పి తన ఇద్దరి అన్నదమ్ములు తలారి ఈరన్న, గ్యాంగ్ లక్ష్మణ్ సహాయంతో కారులో […]
అపార్ట్మెంట్స్ లో నివసించే వారికి చిన్న పిల్లలు ఉన్నారా జర జాగ్రత్త
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వెనక ఉన్న ఉమ్మి సలీం అపార్ట్మెంట్లో ఐదవ అంతస్తు నుంచి ఆరేళ్ల బాలుడు తన్వీర్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. తన్వీర్ మేనత్త నిద్రిస్తుండగా బాలుడు తన్వీర్ లేచి ఆడుకుంటూ ఐదవ అంతస్తు నుంచి జారిపడ్డాడని బంధువులు తెలిపారు. బాలుడు మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న రెండవ పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
అక్రమమద్యం రవాణాపై దాడులు ముగ్గురు మహిళలు ఒక వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వేరువేరు ప్రాంతాల్లో నలుగురు అరెస్ట్ వారి వద్ద నుంచి 8 కర్ణాటక మద్యం బాక్సులు ఒక స్కూటర్ సీజ్ చేశారు సెబ్ అధికారులు. ఉరుకుంద క్రాస్ రోడ్ వద్ద బంటకుంట గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ అనే వ్యక్తి వద్దా మోటర్ సైకిల్ 4 బాక్సులు కర్ణాటక మద్యం, సిరుగుప్ప క్రాస్ రోడ్ వద్ద లక్ష్మి, ఈరమ్మ, హనుమంతమ్మ, చంద్రావతి అనే మహిళల వద్ద 4 బాక్సులు […]
వరల్డ్ సైకిల్ డే సందర్భంగా ఆదోనిలో సైకిల్ ర్యాలీ
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం జూన్ 3 న వరల్డ్ సైకిల్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సైకిల్ ర్యాలీ లో పురుషులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఇందులో రోటరీ క్లబ్ నెంబర్స్ మరియు ఆదోని సైక్లింగ్ క్లబ్ మహిళల పాల్గొన్నారు. సైక్లింగ్ లో పాల్గొన్న వారి కోసం నేషనల్ ఇన్సూరెన్స్ వారు క్యాప్ లు కూల్డ్రింకులు అందించారు.
స్కూటర్ను ఢీ కొట్టిన లారీ ఒకరి మృతి
కర్నూలు జిల్లా ఆదోని శివారు నెట్టేకల్ క్రాస్ రోడ్డు వద్ద బైకును లారీ డీ కొట్టడంతో తిరుమల నగర్ కు చెందిన కరువ శరత్ (34) అనే వ్యక్తి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.