ఉండవల్లిలో సీఎం చంద్రబాబు చేతుల మీదగా రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ అంబులెన్స్ అందించరు.అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ తరపున అంబులెన్స్ ను అందజేశారు. పర్వతనేని ఫౌండేషన్ – లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అంబులెన్స్ ను ప్రభుత్వానికి అందజేశారు. దివంగత టీడీపీ నేత కేంద్రమాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ నుండి ఆయన తనయుడు […]
బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో బిజెపి తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు. ఆదోని 35వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి లలితమ్మ భర్త మధుసూదన శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర మత్స్యకార సంఘం రాష్ట్ర కార్యదర్శి పగడాల నీలకంఠ మరియు భాస్కరరెడ్డి కాలనీ, బీమ్ రెడ్డి కాలనీ, వైఎస్సార్ నగర్ కాలనీలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 150 కుటుంబాలు ఎమ్మెల్యే పార్థసారథి చేతుల మీదుగా బిజెపి కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మధుసూదన […]
ఆరేళ్ల బాలుడిపై పిచ్చి కుక్క దాడి
కర్నూలు జిల్లా ఆదోని రాజీవ్ గాంధీ నగర్ లో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ క్రమంలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల రాము అనే బాలుడి పై దాడి చేసి తలకు కరవడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన బాలుడిని తండ్రి జమ్మన్న వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలించాలని సూచించారు ఈ సందర్భంగా బాలుడు తండ్రి మాట్లాడుతూ […]
టిడిపి నేతలపై చంద్రబాబు ఆగ్రహం…!
అమరావతి : నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నేతలపై నమోదు చేసిన కేసులు వివరాలు ఇప్పటికి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చిన కొంతమంది నాయకులు స్పందించకపోవడంపై సీరియస్ అయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిలు నిర్లక్ష్యం వీడి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో రాష్ట్ర ప్రజల, కార్యకర్తల వారి సమస్యలు కోసం తన నివాసంలో ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి […]
తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద తేది 14.07.2024
కర్ణాటక: తుంగభద్ర: 14. 07. 2024తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 12194 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 14560 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 203 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1606.81 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 31.709 టీఎంసీలు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో జులై 14 తేదీన కొత్త మద్యం పాలసి తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 3760 మద్యం షాపులకు టెండర్లు పిలవడానికి మద్యం పాలసీపై అధికారిక ఈనెల 14వ తేదీ ఉత్తర్వులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
అనంత్ అంబానీ రాధికా పెళ్లి విందులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు
ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు, భువనేశ్వరి. చంద్రబాబు తో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ.రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఈ మేరకు సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి.మహేశ్వర్‌రెడ్డివిజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపికసత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్నపార్వతీపురం మన్యం […]
ముక్కుపచ్చలారని బాలిక పై ఆత్యాచారానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి.
ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీళ్లు తెచ్చి, మనసును కలచివేసిన ముక్కుపచలారని స్రవంతి అత్యాచారంపై భగ్గుమన్న బీసీ సంఘాలు.. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల జిల్లా, పగిడియాల మండలం, ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వాల్మీకి బోయ బీసీ బాలిక వాసంతి పై హత్యాచారానికి పాల్పడ్డ దుర్మార్గులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్కులో ఆడుకుంటున్న అన్నెం […]
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 13-07-24 పత్తి అత్యధికంగా ₹. 7659/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6776/- రూపాయలు కనిష్ట ధర ₹. 3749/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5695/- రూపాయలు కనిష్ట ధర ₹.5695/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 8826/- రూపాయలు కనిష్ట ధర ₹. 3039/- […]