Author: Public Judgement

​బీసీ వసతి గృహాల్లో ఆర్డీవో అరుణ దేవి ఆకస్మిక తనిఖీ

ఆదోని, జూలై 27: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు, విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె. అరుణ దేవి తెలిపారు. సోమవారం ఆదోని పట్టణంలోని బీసీ బాలుర, కళాశాల బాలికల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో ఆహార నాణ్యత, వంటశాలల శుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా […]

రైలు కింద పడి నవవరుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం… ఆదోనిలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఉపేంద్ర (తండ్రి: లక్ష్మన్న) అనే యువకుడు జులై 26వ తేదీ (ఆదివారం) రాత్రి 10 గంటల సమయంలో ఆదోని – నగరూరు రైల్వే స్టేషన్ల మధ్యన ఉన్న కేఎం నంబర్ 492/23-25 వద్ద అప్‌లైన్ రైల్వే ట్రాక్‌పై పడి […]

​ఆదోని క్రికెట్ ఆటగాళ్ల ప్రతిభ – సౌత్ జోన్ జట్లకు ఎంపిక

ఆదోని క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన పలువురు క్రీడాకారులు సౌత్ జోన్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల జూలై 29 నుండి ఆగస్టు 8 వరకు కడపలో జరగనున్న అండర్-19 సౌత్ జోన్ మ్యాచ్‌లకు ఆదోనికి చెందిన మల్లికార్జున ఎంపికయ్యాడు. అలాగే, అండర్-15 బాలికల సౌత్ జోన్ జట్టుకు వై. మేఘనా రెడ్డి, ఎన్. లావణ్య ఎంపికయ్యారు. సౌత్ జోన్ జట్లకు ఎంపికైన ఈ ముగ్గురు క్రీడాకారులను ఆదోని క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు […]

భారీ రావిచెట్టు నేలకొరిగింది.. తప్పిన పెను ప్రమాదం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం హవనపేట వీధి లో ఉన్న వెంకట నర్సప్ప ఆలయ ప్రాంగణంలో భారీ రావిచెట్టు సోమవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ఒక్కసారిగా నేలకొరిగింది. ఉదయం వేళ రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. చెట్టు కొమ్మలు ఇద్దరు వ్యక్తులకు సులభంగా గాయాలైనట్లు తగిలినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని సమాచారం. భారీ చెట్టు కూలిపోవడంతో సమీపంలోని విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడిపోయాయి. […]

తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 27 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1607.32 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 32.596 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే […]

ఆదోనిలో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ ఎరుకుల కాలనీలో ఏకలవ్య జయంతి వేడుకలు యువత ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏకలవ్య జీవిత విశేషాలు, త్యాగం, ధనుర్విద్యలో సాధించిన అపూర్వ ప్రతిభను స్మరించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ బ్యాంకు ఉద్యోగి ఎరుకుల మరెన్న, మాజీ కౌన్సిలర్ లక్ష్మప్ప, ఎరుకుల నాగేష్, ఎరుకుల ఈరన్న, ఎరుకుల ఉరుకుందప్ప, ఎంఈవో రామ్‌మూర్తి, ఈఈఓ వెంకటేష్, […]

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

హోస్పేట: 26.07.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 26 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1606.50 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 31.183 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది […]

ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు.. సీఈఓ

ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు: సీఈఓ వివేక్ యాదవ్ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంఓటర్ల సంఖ్య 4,16,27,694గా నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) వివేక్ యాదవ్ వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ల వివరాలను ఆయన అధికారికంగా ప్రకటించారు. అత్యధికంగా 44,89,488 మంది ఓటర్లకు సరైన అడ్రస్ లేదని సీఈఓ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15,22,174 మంది ఓటర్లు మరణించినట్లు వెల్లడించారు. అలాగే, 14,43,886 మంది ఓటర్లు మరో […]

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..

ఢిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్‌, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరసనలు చేపట్టి, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర […]

ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు

ఆదోని మట్కావాడి వీధిలో క్షుద్రపూజల కలకలం.. ఉస్మాన్ వాలి ఇంట్లో పూజలు చేస్తుండగా పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు.. నిమ్మకాయలు, గుడ్లు, తేలుతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గుర్తింపు.. నిందితులను అదుపులోకి తీసుకున్న టూ టౌన్ పోలీసులు.. కర్నూలు జిల్లా ఆదోనిలోని మట్కావాడి వీధిలో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఇంటి యజమాని ఉస్మాన్ వాలి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిధి కోసం క్షుద్రపూజలు నిర్వహిస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. ఇంట్లో పెద్ద ఎత్తున వింత ముగ్గులు వేసి… […]

Back To Top