News
ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి రోడ్డు లేకుండా చేశారు
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్/ఆర్డీవో (ఇంచార్జ్) హెచ్ ఎన్ ఎన్ ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ లో ఆదోని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని.

- ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన వీరేష్ సంబంధించి సర్వేనెంబర్ 89 నందు 4.50 ఎకరాల భూమిలో 4.50 సెంట్ల భూమిలో గత పది సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేసుకున్నాము. ప్రస్తుతం మా ఇంటి సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమణ
చేసి రోడ్డు మార్గం లేకుండా చేశారు. దయతో విచారం చేసి న్యాయం చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు. - హోళ గుంద మండలం గజ్జహల్లి గ్రామంలో సర్వేనెంబర్ 354 /ఏ నందు 1.00 ఎకరా విస్తీర్ణం కొనుగోలు ద్వారా సంక్రమించినది. ప్రస్తుతం మా తండ్రి గారు చనిపోయిన తరువాత నా యొక్క పేరు మీద రిజిస్టర్ చేయడానికి వెళ్ళగా సదరు భూమి ఆన్లైన్ నందు దేవాదాయ శాఖ భూమిగా ఉన్నది దయతో విచారణ చేసి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయవలసిందిగా అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం నాగనాతహళ్లి గ్రామానికి చెందిన రంగయ్య సంబంధించి సర్వేనెంబర్ 583 నందు 2.05 ఎకరాల విస్తీర్ణం భూమి ఉన్నది ప్రస్తుతం సదరు భూమి ఆన్లైన్ నందు వేరే వారి పేరు నమోదు అయినది దయతో విచారణ చేసి నా యొక్క పేరును నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం ఆరెకల్ గ్రామం అయ్యప్పకు సంబంధించి సర్వేనెంబర్ 147 నందు 2.40 ఎకరాల భూమి మా పెద్దల నుండి సంక్రమించినది. ప్రస్తుతం సదరు భూమి ఆన్లైన్ నందు నమోదు కాలేదు దయతో ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో 49 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు సమర్పించారు. ఈ సమస్యలన్నీ గడువు లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయపు పరిపాలన అధికారి సి. ఆర్. శేషయ్య, డి.ఎస్.పి శివ నారాయణస్వామి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, డి ఎల్ డి వో నాగేశ్వరరావు, డి ఎల్ పి ఓ నూర్జహాన్ గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవికుమార్, ఆర్టీవో నాగేంద్ర, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, సిడిపిఓ ఉమామహేశ్వరి, ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
