News
దుల్హన్ పథకం అమలు
వివాహ పథకం యొక్క ప్రయోజనాలు
ఆంధ్రప్రదేశ్‌లో దుల్హన్ వివాహ పథకాన్ని పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా వివరించబడ్డాయి:
మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయికి వివాహ సమయంలో కుటుంబ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ పథకం ఆర్థిక సహాయం రూపంలో ప్రయోజనాలను మంజూరు చేస్తుంది.
ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయి వివాహ వేడుక కోసం రూ.1,00,000 అందిస్తుంది.
దరఖాస్తుదారు వివాహ తేదీ నుండి ఒక నెల ముందు పథకం కోసం దరఖాస్తు చేయాలి.
అర్హత ప్రమాణం
ఈ వివాహ పథకం కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు కింది అర్హత షరతులను కలిగి ఉండాలి:
వివాహ సమయంలో ఈ పథకాన్ని పొందేందుకు, వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి.
అలాగే, గ్రహీతల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణేతర ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదు.
వధువు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరురాలై ఉండాలి.
అవసరమైన పత్రాలు
మీ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే సమయంలో అవసరమైన డాక్యుమెంట్‌లను అందించాలి.
వధువు మరియు వరుడు ఇద్దరి జనన ధృవీకరణ పత్రం
ఆధార్ కార్డు
కమ్యూనిటీ సర్టిఫికేట్
చిరునామా రుజువు (ఓటర్ ID & రేషన్ కార్డ్)
వివాహ కార్డు
News
ఏపీఎస్ఆర్‌టీసీలో ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్
■ ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధం : ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు..
■ ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్‌టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది..
ఏపీఎస్ ఆర్టీసీలో 7 వేల ఉద్యోగాలకు పైగా భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తాజాగా తెలిపారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్ ఛైర్మన్‌గా సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి నవంబరు 21న బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఉద్యోగాల భర్తీపై సమాచారాన్ని వెల్లడించారు. అలాగే పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా విద్యుత్తు బస్సులు కొనుగోలు చేయనున్నామని వెల్లడించారు. అందిన సమచారాం మేరకు ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న ఖాళీలపై వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరిల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది.
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు చూస్తే.. డ్రైవర్ పోస్టులు 3,673, కండక్టర్ పోస్టులు 1,813, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 656, అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ పోస్టులు 579, ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు 207, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 179, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు 280 వరకు ఉన్నాయి.
News
పెండ్లి చేయడం లేదని తండ్రి పై కొడుకులు దాడి
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లో కన్న తండ్రి అని కనకరం లేకుండా కొడుకులు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. మంత రాజు(60) వృద్ధుడిని తన సొంత కొడుకులే కన్న తండ్రిని దయ దక్షిణం లేకుండా ఇద్దరు కొడుకులు రక్తం గాయాలయ్యాల చితకబాధరు.
స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు నీలకంఠ, చిన్న కొడుకు రాజేష్ వివాహం చేయడం లేదని ఇద్దరు కుమారులు కలిసి తండ్రి పై దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. రెండు కాళ్లు విరిగి రక్త గాయాలు కావడంతో అది గమనించిన స్థానికులు హుటాహుటిన గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
News
13 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ అంతరాష్ట్ర దొంగలముఠాను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముందు హాజరు పరిచారు. 13 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుండి భారీగా ప్రాపర్టీని రికవరీ చేశారు. ఈ ముఠా నుంచి 21 కేసులలో దొంగలించబడిన 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ. 33 లక్షల 7 వేల 8 వందల విలువ) రూ. 8 లక్షల 4 వేల నగదు మొత్తము సుమారు రూ.41 లక్షల, 11 వేల, 8 వందల ప్రాపర్టీ స్వాధీనం చేసుకున్నరు.
ప్రాపర్టీ రికవరీలో ప్రతిభ కనబరచిన ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్, ఎస్సై రామస్వామి , పోలీసుసిబ్బందిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ అభినందించి, రివార్డులు అందజేశారు.
-
Business2 days ago
Gold, Silver Price బంగారు వెండి ధరలు
-
News3 weeks ago
దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..
-
News9 hours ago
పెండ్లి చేయడం లేదని తండ్రి పై కొడుకులు దాడి
-
News1 week ago
ఆస్తి కోసం కన్నతల్లి పై కొడుకు దాడి
-
News2 days ago
కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి
-
News1 week ago
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన
-
News3 days ago
మురికి కాలువలో మృతదేహం
-
News4 weeks ago
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి