కర్నూలు జిల్లా..
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్పందనలో పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.

మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని.

అర్జీలను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్
  1. ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామానికి చెందిన లొడ్డ ఈరన్న సంబంధించి గత కొద్ది రోజుల క్రితం నివాసముంటున్న మా యెక్క ఇల్లు కూలిపోయినది. అందులో మా ఇంటికి సంబంధించిన పత్రాలు పోగొట్టుకుపోయాయి. ప్రస్తుతం సదరు ఇంటికి సంబంధించిన పత్రాలు నకలు పత్రాలు ఇవ్వవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
  2. నందవరం మండలం పులిచింత గ్రామానికి చెందిన పోతురాజు నాగన్న సంబంధించి గ్రామంలో సుమారు 20 సంవత్సరాలుగా 2.50 సెంట్ల ఇంటి స్థలం లో నివాసం ఉంటున్నాము. దయతో సదరు ఇంటి స్థలం కు పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయగలరని అర్జీ సమర్పించుకున్నారు.
  3. ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామానికి చెందిన అంజనమ్మకు సంబంధించి సర్వే నెంబర్ 101/డి నందు 1.17 ఎకరాల భూమి ఉన్నది సదరు భూమి ఆన్లైన్ నందు 2.17 ఎకరాలుగా భూమి గా చూపిస్తుంది. దయతో సదరు భూమిని విచారణ చేసి నా యొక్క భూమిని మాత్రము ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
  4. మద్దికేర మండలం పెరవల్లి గ్రామానికి చెందిన బి. వెంకట సాయి రంగ సంబంధించి గత మాసంలో ఐచర్ వాహనం కొనుగోలు చేయడం జరిగినది. సదరు వాహనం రిజిస్ట్రేషన్ సాంకేతిక సమస్య వలన ఆలస్యమవుతున్నదని దయతో త్వరగా నా యొక్క వాహన రిజిస్ట్రేషన్ త్వరగా చేయగలరని అర్జీ సమర్పించుకున్నారు.
    కార్యక్రమంలో పాల్గొన్న కార్యాలయపు పరిపాలన అధికారి శేషయ్య, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ వేణు సూర్య, శ్రీనివాస రాజు, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవికుమార్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ, డి ఎల్ డి వో నాగేశ్వరరావు, ఆర్టీవో నాగేంద్ర , ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతన్ ప్రియ, ఉప తాసిల్దారులు వినీత్, కౌసార్ భాను, పౌరసరఫరాల శాఖ ఉప తాసిల్దార్ వలి భాష తదితర అధికారులు పాల్గొన్నారు.
స్పందన అర్జీలను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *