News
ముఖ్యమంత్రి కి బ్రాహ్మణ సమస్యలు వివరించిన రాష్ర్టబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెల్లాల మధుసూదన శర్మ
గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు పథకం ద్వారా చేతివృత్తుల వారికి అండగా నిలవడానికి ఎమ్మిగనూరు పట్టణానికి వచ్ఛిన సందర్భంగా ఆపన్నప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదనశర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి రాష్ట్రములోని బ్రాహ్మణ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మధుసూదనశర్మ తో మాట్లాడుతూ ఎలాంటి సహాయం బ్రాహ్మణులకు అవసరమవుతుంది అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమస్యలను ముఖ్యమంత్రి జగనన్నకు వివరిస్తూ ఈబిసి నేస్తం ద్వారా చాలా మంది బ్రాహ్మణ మహిళలకు లబ్ధి చేకూరుతోంది అందుకు జగనన్నకు కృతజ్ఞతలు తెలిపడమే కాకుండా పేద బ్రాహ్మణ యువతులకు వివాహములు జరిపించడం తల్లిదండ్రులకు భారంగా మారిందని అందువల్ల “వేదమాత కల్యాణ వైభవం” అనే పథకము ప్రవేశపెట్టి లక్షా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేస్తే బాగుంటుందని తెలపడమే కాకుండా బ్రాహ్మణులు ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలు, కర్మలు, చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి కష్టాలను తొలగించడానికి “వేదబ్రాహ్మణ అంతిమయాత్ర ఆసరా ” అనే పేరుతో యాభైవేల రూపాయలు అందించాలని, అలాగే క్రెడిట్ సొసైటీ ద్వారా చేతివృత్తులకు, చిన్న వ్యాపారాలు చేసుకునే బ్రాహ్మణ మహిళలకు లక్షరూపాయలు వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని, కర్నూలు పట్టణములో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు వారు వివాహాలు, కార్తీక బోజనాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానాకి చాలా ఇబ్బందులు పడుతున్నారని దయచేసి కర్నూలు పట్టణములో బ్రాహ్మణ భవణము నిర్మించాలని మధుసూదనశర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కోరడం జరిగిందని తెలిపారు.

ముఖ్యమంత్రి జగనన్న సానుకూలంగా స్పందించి ఆయన వ్యక్తిగత కార్యదర్శి చెప్పి మధుసూదన శర్మ ఫోన్ నెంబర్ తీసుకున్నారని మధుసూదన్ శర్మ తెలిపారు. వివరించినంతసేపు శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కి, ఆదోని వైఎస్సార్ పార్టీ యువనేత వై. జయమనోజ్ రెడ్డి కి ధన్యవాదములు తెలియచేసారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్‌సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




