News
8 గ్రామాల సచివాలయాల ముందు ఆందోళన
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని 8 గ్రామ సచివాలయల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పెరిగిన నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, కరెంటు చార్జీల భారాలు తగ్గించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సచివాలయాల ముందు ఆందోళన నిర్వహించరు. నారాయణపురం సచివాలయం దగ్గర సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కే వెంకటేశులు, దొడ్డనకేరి, మాంత్రికి సచివాలయల దగ్గర మండల కార్యదర్శి లింగన్న, గనేకల్, బల్లెకల్ సచివాలయల దగ్గర మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, జే. రామాంజనేయులు, బసరకోడు సచివాలయం దగ్గర ఎం. ఉచీరప్ప హనవాళ్ సచివాలయం దగ్గర పి భాష, సంతే కుడ్లూరు సచివాలయం దగ్గర బీ తిక్కప్ప నాయకత్వం వహించారు.
ఈ ఆందోళనలో సిపిఎం పార్టీ శాఖా కార్యదర్శులు జి రంగనాథ్, కే.పాండురంగ, కే గోవిందు, రామాంజనేయులు, దస్తగిరి బాషా, వీరేష్, పార్టీ సభ్యులు దొడ్డనకేరి మునిస్వామి ఈరన్న, బసరకోడు మునిస్వామి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
News
తుంగభద్ర జలాశయానికి భారీగా పెరుగుతున్న నీటి నిల్వ
హోస్పేట: 07.08.0226:
తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 07 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1622.55 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 68.776 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు:
- ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 47559 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 43814 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
- అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1497 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 74.486 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
News
తుంగభద్ర జలాశయానికి భారీగా పెరుగుతున్న నీటి నిల్వ
హోస్పేట: 06.08.0226:
తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 06 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1621.22 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు:
- ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 60751 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 50500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
- అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1449 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 74.979 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
News
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ధనాపురం, నారాయణపురం గ్రామాల్లో ఇటీవల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. శివరామకృష్ణ, డాక్టర్ ఎస్. ఐసా పర్వీన్, డాక్టర్ ఎస్. రమాదేవి మరియు అధికారులు రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రత్యామ్నాయ పంటలు: […]
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ధనాపురం, నారాయణపురం గ్రామాల్లో ఇటీవల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. శివరామకృష్ణ, డాక్టర్ ఎస్. ఐసా పర్వీన్, డాక్టర్ ఎస్. రమాదేవి మరియు అధికారులు రైతులకు పలు కీలక సూచనలు చేశారు.
ప్రత్యామ్నాయ పంటలు: నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి. పంట బీమా తప్పనిసరి: ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాల నుంచి రక్షణ పొందడానికి ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలి. తేమ సంరక్షణ: నేలలో తేమను కాపాడుకునే పద్ధతులు పాటించాలి. సమతుల్య ఎరువుల వాడకం, కలుపు నివారణ, సరైన సమయంలో యాజమాన్య చర్యలు చేపడితే దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు. పత్తి పంటకు స్ప్రే: ఎండ తీవ్రత, బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి పత్తి పంటపై లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13:0:45) లేదా 10 గ్రాముల 19:19:19 నీటిలో కరిగే ఎరువును కలిపి పిచికారీ చేయాలి.హెచ్చరికలను గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవికె అధికారి నిరంజన్, వ్యవసాయ విస్తరణ అధికారి పి. సతీష్, గ్రామ వ్యవసాయ సహాయకులు నళిని, హరి రామ్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.
-
News4 weeks ago
ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News4 weeks ago
కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News4 weeks ago
ఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks ago
నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్
-
News2 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News3 weeks ago
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు