Connect with us

News

పొలం రాస్తా కోసం ఘర్షణ

Published

on

కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడుగలు గ్రామంలో పొలం రస్తా విషయంలో దావీదు, యల్లప్ప ఘర్షణకు పాల్పడ్డారు. దావీదు వర్గంపై , యల్లప్ప వర్గం కర్రలు కత్తులతో దాడులు చేశారు.
ఈ దాడుల్లో దావీదు వర్గంలో నలుగురికి గాయాలుకావడంతో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యూట్యూబ్ వీడియో లింక్
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 08.08.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 08 (శనివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1623.68 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 72.264 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున   42114 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 40750 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1514 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 78.634 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

చేనేత కార్మికులకు రూ.40 లక్షల రుణాల మెగా చెక్కు పంపిణీ

Published

on

కర్నూలు/ఎమ్మిగనూరు: చేనేత కార్మికుల సంక్షేమం, సంప్రదాయ నేత కళ పరిరక్షణ మరియు మార్కెటింగ్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, ఎమ్మిగనూరు శాసనసభ్యులు బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరులోని కుర్ని ఫంక్షన్ హాల్‌లో 12వ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చేనేత ఉత్పత్తుల స్టాల్స్‌ను తిలకించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… 1905 స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పర్యావరణహిత ఉత్పత్తులుగా ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్రాలకు ఆదరణ పెరుగుతోందన్నారు.

సమావేశంలో హాజరైన జిల్లా కలెక్టర్

ప్రభుత్వ సంక్షేమ పథకాలు & ప్రణాళికలు: విద్యుత్ రాయితీ: 3,145 చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ యజమానులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్. ​పింఛన్ & రుణాలు: 2,707 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.4,000 పింఛన్, పీఎం ముద్ర కింద 232 మందికి రూ.1.68 కోట్ల రుణాలు. ​మార్కెట్ అనుసంధానం: ప్రముఖ బ్రాండ్ “తనేరా” గడిచిన 6-7 నెలల్లో రూ.30 లక్షల విలువైన జిల్లా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ​జిఐ ట్యాగ్ & టెక్స్‌టైల్ పార్క్: ఎమ్మిగనూరు వస్త్రాలకు భౌగోళిక గుర్తింపు (GI Tag) ప్రక్రియ కొనసాగుతోందని, బనవాసిలో టెక్స్‌టైల్ పార్క్ మరియు టిడ్కో కాలనీ సమీపంలో 80 సెంట్ల స్థలంలో ‘వీవర్స్ శాల’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు.

చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ సిరి

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… చేనేత కార్మికులను “చేనేత కళాకారులు”గా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ​చేనేత కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం అని ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు.అగ్గిపెట్టెలో ఇమిడేంత సన్నని చీరలను నేసే ప్రతిభ ఎమ్మిగనూరు కళాకారుల సొంతమని కొనియాడారు. ఎమ్మిగనూరు ఖ్యాతిని పెంచడంలో పద్మశ్రీ మాచాని సోమప్ప చేసిన సేవలను స్మరించుకున్నారు. ​నేతన్న సేవలో: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25,000 ఆర్థిక సాయం. ఇంటిగ్రేటెడ్ హ్యాండ్‌లూమ్ టెక్స్‌టైల్ పార్క్: బనవాసిలోని 77 ఎకరాల ఎంఎస్‌ఎంఈ పార్కులో 22 ఎకరాలను ప్రత్యేకంగా టెక్స్‌టైల్ పార్క్ కోసం కేటాయింపు. ​ఆధునిక సాంకేతికత: తమిళనాడు, కర్ణాటక తరహాలో ఆధునిక మగ్గాలు, డిజైనింగ్ శిక్షణ, వీవర్స్ షెడ్ల ఏర్పాటు. మౌలిక సదుపాయాలు: ఎమ్మిగనూరు పట్టణంలో తాగునీటి పథకంతో పాటు ప్రతి ఇంటికి నాణ్యమైన నీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి. ​రూ.40 లక్షల రుణాల పంపిణీ: కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుల స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో రూ.40 లక్షల రుణాల మెగా చెక్కును కలెక్టర్ మరియు ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

​ఈ కార్యక్రమంలో జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, కుర్ని కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప, చేనేత కళాకారుడు నరసప్ప, బిజెపి ఇన్చార్జ్ నరసింహులు, జనసేన ఇన్చార్జ్ రేఖ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, వివిధ శాఖల అధికారులు, మాస్టర్ వీవర్స్ మరియు చేనేత కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.. జిల్లా కలెక్టర్

Published

on

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించారు.

సమావేశంలో హాజరైన అధికారులు ప్రజలు

​కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు వస్తున్న వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ, సర్వే శాఖలకు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వహించే సమయంలో సరిహద్దు రైతులకు తప్పనిసరిగా నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే ప్రక్రియ పూర్తి చేయాలని సర్వే శాఖ డిడి అరుణ్ కుమార్ కు స్పష్టం చేశారు.

సమావేశంలో హాజరైన అధికారులు

​ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నిర్ణీత కాలపరిమితిలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 22-ఏ నిషేధిత జాబితా, రీ-సర్వే వివాదాలు, ఇనాం భూముల నమోదు, పట్టా భూముల వ్యత్యాసాలతో పాటు పింఛన్లు, తాగునీరు, విద్యుత్, గృహాల మంజూరుకు సంబంధించిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరిస్తున్న ఫోటో

​ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణ దేవి, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, డిఆర్డిఏ పిడి శ్రీధర్, డిపిఓ భాస్కర్, ఐసిడిఎస్ పిడి విజయ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరిస్తున్న ఫోటో
Continue Reading

Trending