◆ హోటళ్లపై విజిలెన్స్ అధికారులు దాడులు..
◆ 7 హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు..
◆ 5 గ్యాస్ సిలిండర్లు సీజ్, 1లక్ష 55 వేలు జరిమాన విధించిన అధికారులు..
కర్నూలు జిల్లా ఆదోనిలో విజిలెన్స్ అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు ఏడు హోటల్ కలిపి 5 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, 1,55,000 జరిమానా విధించారు. తుల్జా భవన్ హోటల్ కు 20 వేలు, బృందావన్ బార్ అండ్ రెస్టారెంట్కె 30 వేలు, హైదరాబాద్ బిర్యానీ హోటల్ 20 వేలు, న్యూ ఉష హోటల్ 20 వేలు, ఆవకాయ హోటల్‌కు, 25 వేలు, తాజ్ బిర్యాని హోటల్‌కు 20 వేలు, జాతర హోటల్‌కు 20 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు ఈ దాడుల్లో సీఐ సునీల్ కుమార్ వారి సిబ్బంది మరియు మున్సిపల్ సెంట్రింగ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్, పులికొండ, శ్రీనివాస్, నరసప్ప పాల్గొన్నారు.