కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కార్పొరేట్ విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమ అడ్మిషన్ల ను అరికట్టాలని పిడిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయుకులు తిరుమలేష్, డివిజన్ ప్రెసిడెంట్ ఖాదర్ మాట్లాడుతూ విద్యా అకాడమిక్ ఓపెన్ కాకముందే అడ్మిషన్ల కొరకు బ్యానర్లు కట్టుకొని విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారు అలాగే సెలవు దినాలలో కూడా ఉపాధ్యాయులను అడ్మిషన్ల కొరకు పాఠశాలలో పని చేయించుకోవడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా విద్యా అధికారులు కూడా కార్పొరేట్ విద్యా సమస్యలపై చర్యలు తీసుకోకపోవడం వలన కార్పొరేట్ విద్యాసంస్థలలో విద్య వ్యాపారంగా మారిందని తెలిపారు. తక్షణమే అధికారుల స్పందించి జరుగుతున్న అక్రమాలు అరికట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ కోరారు. లేనియెడల పెద్ద ఎత్తున అధికారుల ఆఫీసుల ముందు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగస్వామి, ఆది, శివ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

PDSO నిరసన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *