కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల కౌంటింగ్ స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రేపు (నవంబర్ 3న) ఉదయం 8:00 గంటల నుంచి ప్రారంభం కానుంది.

కౌంటింగ్ వివరాలు & ఏర్పాట్లు: ◆ మొత్తం వార్డులు: 52 ◆ మొత్తం ఓటర్లు: 1,76,676 ◆ పోలైన ఓట్లు: 94,687 ◆ 4 రౌండ్లలో లెక్కింపు.. 104 టేబుళ్లు ఏర్పాటు: మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ల అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 104 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ మొత్తం 4 రౌండ్లలో పూర్తి కానుంది. ఈ ప్రక్రియ కోసం మొత్తం 416 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫలితాలు మధ్యాహ్నానికి వెల్లడయ్యే అవకాశం ఉంది.
