కర్నూలు జిల్లా ఆదోని మండలంలో గత ఐదు రోజులు గా రాత్రిపూట తీస్తున్న కరెంటు కోతలకు వ్యతిరేకంగా పాండవగల్లు గ్రామంలో టార్చ్ లైట్ తో సిపిఎం పార్టీ నిరసన తెలిపారు. రాత్రిపూట కరెంటు కోతలు విధిస్తూ కూటమి ప్రభుత్వం మరియు కరెంట్ అధికారులు ప్రజలను పట్టించుకోవడంలేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు జే. రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలను మూడు విధాలుగా కరెంటు అధికారులు మరియు ప్రభుత్వం ఇబ్బందిపెడుతున్నారని, నిద్రపోయే సమయంలో, వంట చేసుకుని సమయంలో, భోజనం చేసే సమయంలో కరెంటు కోతలు విధించడం వల్ల ఇంట్లో ఉక్కపోత బయటకు వస్తే దోమల కాటు లాంటి పరిస్థితి తయారయిందని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే మరియు కూటం నాయకులు ఎవరు కరెంటు కోతల గురించి మాట్లాడక పోవడం బాధాకరం అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రోడ్డు దిబ్బందుల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు పాండురంగ, శాఖ కార్యదర్శి అనీఫ్ భాష, పార్టీ సభ్యులు నర్సిరెడ్డి, హనుమంత రెడ్డి, కొండయ్య, తాయప్ప, భీమాంజి, నాగరాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.