కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఆదోని డీఎస్పీల ఆదేశాల మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ (పీస్ కమిటీ) సమావేశం నిర్వహించారు. రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఇస్వి స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు వివిధ మతాల ప్రతినిధులతో పోలీసులు సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా అధికారులు ఉత్సవ నిర్వాహకులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేయదలచిన నిర్వాహకులు ముందుగ https://ganeshutsav.net పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, పోలీసు శాఖ అనుమతి పొందాలని తెలిపారు. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. పండుగను మత సామరస్యంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
