ఆదోని మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోతే ప్రజాగ్రహం తప్పదు: నూర్ అహ్మద్ హెచ్చరిక

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తీవ్రరూపం దాల్చుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలంటే తక్షణమే మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. గత 38 సంవత్సరాలుగా కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం మరియు స్వార్థ ప్రయోజనాల వల్లే ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. పట్టణ అవసరాల నిమిత్తం వచ్చే స్థానిక, గ్రామీణ ప్రజలు ప్రతిరోజూ ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు.

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్

మాస్టర్ ప్లాన్ పేరిట దుకాణాలు, నివాసాలకు మార్కింగ్ వేసి కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారని, పనులను బుట్టదాఖలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి గారు మాస్టర్ ప్లాన్ ఆవశ్యకతపై మాట్లాడటాన్ని ఎంహెచ్‌పీఎస్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో రోడ్ల వెడల్పు పనులు చేపట్టి మాస్టర్ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేవరకు ప్రజలకు భరోసా కలగదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయకపోతే నియోజకవర్గ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని నూర్ అహ్మద్ హెచ్చరించా

Back To Top