News
మత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
మద్యం మత్తులో వాహనాలు నడిపితే తీవ్రమైన శిక్షలు తప్పవని మరోసారి రుజువు అయ్యింది.

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లో పట్టుబడిన 15 మందిని పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వారిలో ట్రాఫిక్ పోలీసులు నలుగురిని, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మందిని అదుపులోకి తీసుకుని కోర్టు లో హాజరు పరుచగా విచారణ అనంతరం న్యాయమూర్తి 4 గురికి ఒక వారం రోజులు, 5 గురికి 30 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదోని సబ్ జైలుకు తరలించరు. 6గురికి 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించరు. రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకులు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో పాటు, అన్ని రకాల వాహనాలను నడిపే వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను రోడ్డుపై నడపవద్దని, ఇది చాలా ప్రమాదకరమని ఇకపై ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో పట్టుపడితే ఇదే విధమైన జైలు శిక్ష తప్పదని ఆదోని పోలీసులు హెచ్చరించరు.

News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
