News
తప్పిపోయి 30 సంవత్సరాల తర్వాత ఇంటికి చేరిన యువకుడు..
తప్పిపోయి 30 సంవత్సరాల తర్వాత సొంత కుటుంబానికి చేరాడు యువకుడు..
కర్నూలు జిల్లా ఆదోని పట్టానికి చెందిన వీరేష్ గత 30 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల వయసులో రైల్లో తప్పిపోయి తమిళనాడులో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ బోర్డింగ్ లో కొద్దిరోజులు నివసించి. అక్కడనుండి ముంబై లోని అనాధాశ్రమమునకు బదిలీ చేశారు. అక్కడే పదవ తరగతి వరకు చదువుకొని హోటల్లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటికైనా సొంత వారిని కలుస్తానన్న ఆశ తగ్గలేదు. కేవలం అతనకు నానమ్మ అంజనమ్మ, నాన్న జనార్ధన్, ఊరు ఆదోని అని మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి ఆదోని లో తిరుగుతున్న ఎటువంటి కుటుంబ సభ్యుల సమాచారం అందలేదు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉన్నదని తెలుసుకొని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు తనకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. అనంతరం సబ్ కలెక్టర్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ ఫోన్ ద్వారా వీరేష్ వివరాలు తెలియజేసారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఉండే సచివాలయాల్లో మరియు సామాజిక మాధ్యమం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న మేనత్త భర్త జగదీష్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. జగదీష్ విషయాలను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తాసిల్దార్ వారికి మరియు మున్సిపల్ కమిషనర్కు సబ్ కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా వీరేష్ వారి అమ్మ వీరేష్ పుట్టిన సంవత్సరం లోపల మరణించిందని, వీరేష్ తండ్రి అనారోగ్యంతో 2008 సంవత్సరంలో మరణించాడని అలాగే వారి నానమ్మ అంజనమ్మ 2011వ సంవత్సరంలో మరణించారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులలో వారి మేనత్త లక్ష్మి (చిట్టెమ్మ) మాత్రమే జీవించారని ప్రస్తుతం వారు కర్నూలు నగరంలో నివసిస్తున్నారని విచారణలో తెలిపారు. చిన్నప్పుడు తను నివసించిన ప్రదేశాల్లో మేనత్త భర్త అయినా జగదీష్ తీసుకెళ్లి చూపించాడు. చూసిన వీరేష్ ఇవన్నీ నిజమేనని వీరు నా రక్త సంబాధికులే అని వీరేష్ అధికారులకు తెలిపాడు.
ఈ సందర్భంగా వీరేష్ జనార్ధన్ మాట్లాడుతూ… నేను చిన్న వయసులో తప్పిపోయాను, 30 సంవత్సరాలు అయిందని నా కుటుంబ సభ్యులను , 24 గంటల్లోపే నాయొక్క కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన సబ్ కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్, రెవెన్యూ, మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మేనత్త భర్త అయినా జగదీష్ మాట్లాడుతూ… వీరేష్ కొరకు చాలా రోజులుగా వెతికాము కానీ ఎటువంటి సమాచారం లేదు, 30 సంవత్సరాల తర్వాత వీరేష్ మమ్మల్ని వెతుక్కుంటూ రావడం చాలా భావిద్వేగానికి గురై సంతోషం గా ఉన్నది. వీరేష్ మా వరకు తీసుకొని వచ్చిన ప్రభుత్వ అధికారులకు మరియు మీడియా కృతజ్ఞతలు తెలియజేశారు.
News
భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త
అదోని: తన భార్యను అత్తగారింటి నుండి పంపడం లేదన్న మనస్తాపంతో ఒక యువకుడు ఏకంగా రేడియో టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు మూడు గంటల పాటు హైడ్రామా నడిచిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో యువకుడు క్షేమంగా కిందకు దిగాడు.

అసలేం జరిగింది?.. ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండలం నేమకల్ గ్రామానికి చెందిన సురేంద్ర, అదే గ్రామానికి చెందిన నాగేశ్వరి అనే యువతిని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పండగ కోసమని నాగేశ్వరిని ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. పండగ ముగిసినా తన భార్యను తిరిగి కాపురానికి పంపకపోవడంతో సురేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
టవర్ ఎక్కి హల్చల్ : శనివారం అదోనిలోని రేడియో టవర్ ఎక్కిన సురేంద్ర, తన భార్యను పంపకపోతే కిందకు దూకేస్తానని బెదిరించాడు. మూడు గంటల పాటు టవర్ పైనే ఉండి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న సీఐ రాజశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసుల హామీతో శాంతించిన యువకుడు .. సీఐ రాజశేఖర్ టవర్ కింద నుండి సురేంద్రతో మాట్లాడి నచ్చజెప్పారు. “నీ భార్యను, మీ అత్తమామలను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడతాం. మీ ఇద్దరినీ కలిపి కాపురానికి పంపించే బాధ్యత నాది” అని సీఐ హామీ ఇవ్వడంతో సురేంద్ర శాంతించి కిందకు దిగివచ్చాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భార్యపై ఉన్న ప్రేమతోనే ఆవేశంలో ఇలాంటి పని చేశాడని సీఐ మీడియాకు వివరించారు
News
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్‌కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

