News
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 7 మంది బెట్టింగ్ రాయుల్లను సిఐ శ్రీరామ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 91 లక్షల నగదు స్వాధీనం, 7 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముందు హాజరు పరచరు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెలలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చాలామంది యువకులు క్రికెట్ బెట్టింగ్ ను ఆన్ లైన్ లో ఆడుతూ, బెట్టింగ్ కు వ్యసనపరులుగా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు చేసి మరీ, ఆ అప్పులు తీర్చలేకఇంట్లో తల్లితండ్రులకు చెప్పుకోలేక , తమ భవిష్యత్తు పై వారి తల్లి తండ్రులు పెట్టుకున్న ఆశలను అడియశలు చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుచున్నాయని బెట్టింగ్ ను ఎలాగైనా అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పి M. హేమలత పర్యవేక్షణ లో ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీ రామ్ మరియు వారి సిబ్బంది రాబడిన సమాచారము మేరకు 18.05.2025 వ తేదీన సాయంత్రం 03.30 గంటలకు వాల్మీకి నగర్ లోని వాల్మీకి గుడి కి ఎదురుగా మొబైల్ ఫోన్ లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడి చేసి ఎస్. ఆర్.నాగరాజును అదుపులోనికి తీసుకోగా మిగిలిన ముద్దాయులు పారిపోయారు. అతని నుండీ నగదు 50,000 వేల రూపాయలను స్వాదీన పరచుకుని ఆదోని వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఏపీ గేమింగ్ యాక్ట్ ( క్రికెట్ బెట్టింగ్ ) క్రింద కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.



టెక్నాలజీ ఆధారంగా దొరికిన సమాచారం మేరకు సిఐ శ్రీ రామ్ కర్నూలు, హైదరాబాదు, ఒంగోలు, చిలకలూరు పేట, బెంగళూరు సిటిలో పూర్తి సమాచారాన్ని తెలుసుకొని 30.05.2025వ తేదీన మద్యాహ్నం 11.30 గంటలకు ఆదోని టౌన్ లోని ఎల్లమ్మ కొండ లోని మర్రి చెట్టు దగ్గర 7 మంది
1. ఆదోని పట్టణం మసీదుపుర కు చెందిన ఇస్మాయిల్ @ ఇస్మాయిల్, వయసు 44 సం. లు
2. ఆదోని పట్టణం బోయగిరికి చెందిన బోయ మహానంది వయసు 55 సం. లు,
3. ఆదోని పట్టణం మరాఠి వీధికి చెందిన బోయ రమేశ్, వయసు 26 సం. లు,
4. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీకి చెందిన చిక్కబళ్లాపూర్ వాసి రాజేష్, వయసు 38 సం. లు,
5. ఒంగోలు జిల్లా జరుగుమల్లి మండలం, ఎద్దులూరిపాడు గ్రామనికి చెందిన చుండి శ్రీనివాస రావు @ నాయుడు, వయసు 48 సం .లు,
6. ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ సత్యనారాయణపురం కు చెందిన అడ్డాల కల్యాణ్, వయసు 33 సం,
7. హైదరాబాద్ కు చెందిన రఘు ఆచారి
ఏడు మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి 07 మొబైల్ ఫోన్ లు 91,00,000 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముందు హాజరు పరచరు.
వీరు ఆడుతున్న క్రికెట్ బెట్టింగ్ యాప్స్
1. నేషనల్ ఎక్సేంజ్ 9
2. రాధే ఎక్సేంజ్ ,
3. వజ్రా ఎక్సేంజ్,
4. నేషనల్ 777,
5. మోర్ ఎక్సేంజ్

ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి సాంకేతికత సహాయంతో క్రికెట్ బుకీలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన ఆదోని డిఎస్పీ హేమలతను , ఆదోని వన్ టౌన్ సిఐ శ్రీరామ్, ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మునిస్వామి, రంగస్వామి, ఏకవీర, ఫక్కీరప్ప, హుస్సేన్ భాషాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.

News
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
కర్నూలు జిల్లా ఆదోని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని , NTA రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు టర్నింగ్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసన పై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం చాలా దారుణంఅని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News
ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి
ఆదోని: కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA) ఆదోని డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం (జూలై 19న) స్థానిక రెవెన్యూ భవన్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఎన్నికల అధికారి శ్రీ డి. నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. నోటిఫికేషన్ ప్రకారం కొన్ని పదవులకు పోటీ జరగ్గా, మరికొన్ని పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం 2026-2029 కాలానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు.

నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:
- ప్రెసిడెంట్: రజినీకాంత్ రెడ్డి (కౌతాళం తహశీల్దార్)
- అసోసియేట్ ప్రెసిడెంట్: జె. బాబు (ఆదోని డిప్యూటీ తహశీల్దార్)
- సెక్రటరీ: వలిబాషా (పెద్దకడుబూరు తహశీల్దార్)
- ట్రెజరర్: రాఘవేంద్ర
- వైస్ ప్రెసిడెంట్లు: రుద్రగౌడ్, జెర్మియా, కౌసర్ భాను
- జాయింట్ సెక్రటరీ: మహేష్
- ఎగ్జిక్యూటివ్ మెంబర్: రామయ్య
- స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ: బి. పెద్దయ్య

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు రెవెన్యూ శాఖ అధికారులు, సహచర ఉద్యోగులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, సేవా సమస్యల పరిష్కారానికి, రెవెన్యూ శాఖ అభివృద్ధికి మరియు ఉద్యోగుల ఐక్యతకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

News
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న 1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు.
డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నలుగురు అనధికారులు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు వారి అసిస్టెంట్లు మరియు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇద్దరు ప్రవేటు వ్యక్తులు ఉన్నారని వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య వారి సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.



-
News2 weeks agoఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News2 weeks agoకుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News2 weeks agoఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News2 weeks agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks agoఅదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్‌లు స్వాధీనం
-
News2 weeks agoవృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
-
News2 weeks agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News2 weeks agoనిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్
