కర్నూలు జిల్లా ఆదోనిలో PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF జిల్లా కార్యదర్శి ఉదయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది విద్యార్థులు ఆదోనికి చదువుకోడానికి వస్తున్నారు కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం లేదు, సొంత భవనం లేదని అద్దె భవనంలో కళాశాల నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఇది చాలా సిగ్గుచేటు కాబట్టి తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించి భవన నిర్మాణం పూర్తి చేయాలని డి.ఎస్.ఎఫ్ పి.డి.ఎస్.ఓ విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆదోని డివిజన్ లో చాలా సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వాలు మారుతున్న కూడా ఆదోనికి మాత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం లేదు.. సొంత భవన నిర్మాణం లేదు… అలాగే మైనారిటీ ఐటిఐ కళాశాల భవన నిర్మాణం కూడా పూర్తిచేసి వచ్చే అకాడమీ కేర్ అంత పూర్తి చేసి అడ్మిషన్లు ప్రారంభించాలని కోరారు. లేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతామని మరొక్కసారి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ నాయకులు డివిజన్ కార్యదర్శి శివ, పట్టణ కార్యదర్శి రాజేష్ డిఎస్ఎఫ్ నాయకుడు హనుమేష్ రఘు వీర తదితరులు పాల్గొన్నారు.