News
కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం

పెహెల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సామాన్య ప్రజల ఆత్మకు శాంతి కలగాలని
కర్నూలు జిల్లా ఆదోని భీమాస్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం ప్రకటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించరు. కన్వీనర్ నూర్ అహ్మద్ మాట్లాడుతూ శత్రువులను కూడా క్షమించడమే మహమ్మద్ ప్రవక్త బోధన దానికి విరుద్ధంగా ఉగ్రవాదులు తాము ముస్లింలను చెప్పుకుంటూ సామాన్యులను చంపడం ఇస్లాంకు విరుద్ధమైన చర్య.దీన్ని ప్రతి ముస్లిం ఖండిస్తున్నారు అన్నారు. ఉగ్రవాదులను వెంటనే అరెస్ట్ చేసి ఎర్రకోట ముందు బహిరంగంగా భారతదేశ ప్రజలందరూ చూస్తుండగా తలలు నరికి వేయాలని నూర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా వారికి ఆదోని ముస్లిం జేఏసి అండగా నిలబడుతుందని మద్ధతు ప్రకటించారు. మతసామరస్యం, దేశసమగ్రత కోసం ఆదోని ముస్లిం జేఏసీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
నాయకులు మహ్మద్ నూర్, సద్దాం హుస్సేన్, మన్సూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉగ్రవాదు దాడులు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని అదేవిధంగా నిందితులను కఠినాతి కఠినంగా బహిరంగ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంతాప సభలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, సేవా సంఘాల నాయకులు కన్వీనర్ నూర్ అహ్మద్, కో కన్వీనర్ మహమ్మద్ నూర్ ,నాయకులు లాయర్ సద్దాం హుస్సేన్, వసీం సాహెబ్, అర్షద్, మన్సూర్ , ఇస్మాయిల్, కౌన్సిలర్ హాజీ, ఫారుఖ్, జీలాన్, షకీల్ మరియు ముస్లిం యువత పాల్గొన్నారు.
News
పాము కాటుకు మహిళ మృతి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో పాము కాటుకు మంగమ్మ అనే మహిళ మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాలు ఈలా ఉన్నాయి.. ఉదయం పత్తి పొలంలో ఎరువు చల్లడానికి వెళ్ళిన మంగమ్మ కు పాము కరిచిందని వెంటనే చికిత్స నిమిత్తం ఆటోలో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మంగమ్మ ను పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలపడంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 27 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 12/- రూపాయలు, రిటైల్: 1kg 14/- రూపాయలు


News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 26-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 17377 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 16916 క్యూసెక్కులు
-
News3 weeks ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News3 weeks ago
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్
-
News3 hours ago
పాము కాటుకు మహిళ మృతి
-
News3 weeks ago
ఆటో డ్రైవర్స్ లకు అవగాహన
-
News3 weeks ago
వికలాంగుల పెన్షన్ దారుల ఆవేదన
-
News3 weeks ago
కర్రతో దాడి తలకు తీవ్ర గాయం
-
News3 weeks ago
కాలేజ్ ప్రాంగణంలో నెట్వర్క్ టవర్ను తొలగించాలి విద్యార్థి సంఘాల డిమాండ్